శ్రీకాకుళం: మేకవన్నె పులిలాంటి వైఎస్సార్ కాంగ్రెస్ ను నమ్మి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని ఏపి టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. కానీ ఎన్నో ఆశలతో ఓటేసిన ప్రజల నమ్మకం ఈ ఏడునెలల పాలనలో ఆవిరయ్యిందని... కాస్తో కూస్తో వుంటే ఈ అసెంబ్లీ సమావేశాలతో పూర్తిగా పోయిందని పేర్కొన్నారు. ఇన్నెళ్ల తన రాజకీయ జీవితంలో ఇంత అప్రజాస్వామిక పాలనను తానెప్పుడు చూడలేదని వెంకట్రావు విరుచుకుపడ్డారు. 

ప్రతిపక్ష ఎమ్మెల్యే లను అసెంబ్లీలోకి రానివ్వకుండా గేటు వద్దే ఆపేయటం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఇది అసెంబ్లీ సాంప్రదాయాలను పాటించకపోవడమేనని... అసెంబ్లీ చరిత్రలో దీన్ని ఓ చీకటి రోజుగా గుర్తుపెట్టుకుంటామని పేర్కొన్నారు. 

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడిని మార్షల్స్ అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచిగా పాలించాలనే కానీ ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టమని కాదన్నారు. వైసీపీ అధికారం వుందికదా అని ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

read more జగన్ తీసుకున్నది అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం...: మంత్రి అనిల్

నిరంకుసత్వంగా వ్యవహరించిన సీఎంలు చరిత్రలో ఏమయ్యారో తెలుసుకోవాలని సూచించారు. అప్పుడయినా ప్రస్తుతం సీఎం జగన్, ప్రభుత్వ వ్యవహారంలో మార్పు వస్తుందేమో చూడాలన్నారు. 

అసెంబ్లీని నిష్పక్షపాతంగా,స్వతంత్రంగా నిర్వహించాల్సిన స్పీకర్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. ఇలా అసెంబ్లీని ఎక్కువరోజులు నడపడం కుదరదని...గతంలో అసెంబ్లీ స్పీకర్లు ఎంత హుందాగా, నిస్పక్షపాతంగా వ్యవహరించేవారో తెలుసుకోవాలని సూచించారు. 

మీడియా కు సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగా పనిచేస్తే మీడియాపై ఆంక్షలు ఎందుకన్నారు. 6 మాసాల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏమి లేదన్నారు.

read more పక్క రాష్ట్రంలో ఘటన... ఇక్కడ చట్టం... దమ్మున్న సీఎంకే సాధ్యం: కన్నబాబు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. అసెంబ్లీలో జవాబు చెప్పలేకే ప్రభుత్వం పారిపోతోందన్నారు. ప్రభుత్వం జవాబుదారీతనం  అలవర్చుకోవాలని... ప్రశ్నిస్తే బయటికి పంపిస్తాం అన్నట్టు వ్యవహరించడం మంచిది కాదని  కళా వెంకట్రావ్ సూచించారు.