Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో భారీగా తగ్గిన మద్యం విక్రయాలు...

ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా మద్యం విక్రయాలు తగ్గాయి. జగన్ ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్లే విక్రయాలు  రోజురోజుకు తగ్గిపోతున్నాయి.  

liquar sales decreased in anhra pradesh
Author
Amaravathi, First Published Nov 2, 2019, 7:08 PM IST

అమరావతి: మద్య నియంత్రణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న  నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్టోబరు నెలలో గణనీయంగా మద్యం విక్రయాలు, వినియోగం తగ్గు ముఖం పట్టాయి. రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ విడుదల చేసిన వివరాలే దీనికి నిదర్శనంగా నిలిచాయి. 

బెవరేజెస్‌ కార్పొరేషన్‌ తాజా వివరాలు ప్రకారం... 2018 అక్టోబరులో 32,28,366 కేసులు లిక్కర్‌ను విక్రయించగా 2019 అక్టోబరులో మాత్రం 23,60,089 కేసులు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కోన్నారు. గతేడాది అక్టోబరు నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరు నెలలో మద్యం విక్రయాలు 27 శాతం తగ్గాయని సదరు కార్పోరేషన్ వెల్లడించింది. 

అదే బీర్ల అమ్మకాలు చూసుకుంటే  2018 అక్టోబరులో 23,86,397 కేసులు అమ్మడుకాగా ఈ ఏడాది అక్టోబరులో 10,40,539 కేసులు మాత్రమే విక్రయించినట్లు తెలిపారు. ఇలా గత ఏడాది అక్టోబరుతో పోలిస్తే 56.4 శాతం తక్కువగా బీర్లు అమ్మకాలు జరిగినట్లు వెల్లడించారు.

read more  మీడియా ఆంక్షలపై ప్రకటనల ఎఫెక్ట్: రామచంద్రమూర్తి, అమర్‌లపై వర్ల రామయ్య ఫైర్

ఈ ఏడాది నూతన ప్రభుత్వం  ఏర్పడేనాటికి రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను 4380 వుండగా వాటిని 3500కు తగ్గించారు. అలాగే కొన్ని షాపులను ప్రభుత్వమే  నిర్వహిస్తుండటంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. మద్యం అమ్మకాలను ఉదయం 11 గంటలనుంచి రాత్రి 8 గంటల వరకూ పరిమితం చేయడం అమ్మకాలు తగ్గడానికి మరో కారణంగా తెలుస్తోంది.తాజా నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వం మొత్తం పర్మిట్‌ రూమ్‌లను రద్దుచేసింది.  

మరోవైపు గ్రామాల్లో కూడా బెల్టుషాపుపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.  ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో ఎక్సైజ్‌ అధికారులు, పోలీసులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఇది కూడా మద్యం విక్రయాలు తగ్గడానికి  మరో కారణంంగా తెలుస్తోంది.

read more  లాంగ్ మార్చ్ కు అన్ని అనుమతులు రెడీ...కావాలనే దుష్ప్రచారం..: నాదెండ్ల

అలాగే ఇటీవలే నియమితులైన గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా గ్రామాల్లో నిరంతరం నిఘా పెంచుతున్నారు. బెల్టుషాపులద్వారా అక్రమ మద్యం విక్రయాలకు అవకాశం ఉన్న ప్రదేశాలపై నిఘాను పటిష్టంచేశారు. మద్యం అమ్మకాలు గ్రామాల్లో జరగనీయవద్దంటూ పోలీసులు నేరుగా ఆయా గ్రామంలోని పెద్దలకు ఫోన్లు చేసి మరీ చెప్తున్నారు. 

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మరో వైపు మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా వేస్తున్న అడుగుల్లో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. గ్రామ సచివాలయాల ఏర్పాటులో భాగంగా మహిళా పోలీసులను నియమించడం కూడా రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టడానికి  కారణంగా తెలుస్తోంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios