పక్క రాష్ట్రంలో ఘటన... ఇక్కడ చట్టం... దమ్మున్న సీఎంకే సాధ్యం: కన్నబాబు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళా రక్షణకోసం దిశా యాక్ట్ ను తీసుకువచ్చింది. ఈ యాక్ట్ కు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపట్టిన సందర్భంగా జరిగిన చర్చలో మంత్రి కన్నబాబు సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు.
అమరావతి: పక్కరాష్ట్రం తెలంగాణలో దిశ అనే యువతిపై దారుణం జరిగితే బాధ్యాతాయుతమైన సీఎం పదవిలో జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు అద్భుతంగా వుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. అక్కడ ఘటన జరిగితే చలించిపోయిన జగన్ మన ఆడబిడ్డల రక్షణ కోసం దిశ చట్టం తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఈ చట్టం అవసరాన్ని గుర్తించి వెంటనే దాన్ని మంత్రిమండలి, అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన దమ్మున్న సీఎం జగన్ అని కన్నబాబు పేర్కొన్నారు.
''దిశా లాంటి చట్టాన్ని తీసుకువచ్చిన తమ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అందరూ పొగుడుతున్నారు. ఎవరికైనా దిశా చట్టం లాంటి దాన్ని తీసుకొచ్చే దమ్ముందా. ప్రజలు ఏం కోరుకుంటే ఆ తీర్పు వైపు ప్రతీఒక్కరూ ఆలోచించాలి. కానీ అలాంటి తీర్పులివ్వం అని మొన్న మంత్రివర్గ సమావేశంలో సీఎం మాకు చెప్పారు. అయితే 21 రోజుల్లో కన్‌క్లూజన్‌కి తీసుకొచ్చి చట్టపరమైన శిక్షలు పడేలా చేస్తామని చెప్పారు'' అని మంత్రి వెల్లడించారు.
''డిలేయిడ్ జస్టిస్ ఈజ్ డినేయిడ్ జస్టిస్ ఆంటారు. బాధితులు న్యాయం కోసం ఎంతకాలం ఎదురు చూడాలి. నిర్భయ నిందితుల్లో ఒకడు జైలుకు వెళ్లినప్పుడు ఎలా ఉన్నాడు... బయటకొచ్చినప్పుడు ఎలా ఉన్నాడు. కండలు పెంచుకుని సిక్స్ ప్యాక్‌తో జైలు నుంచి వచ్చాడు. వాళ్లనా మనం సమర్ధిస్తాం. మూడు వారాల్లో ఖచ్చితంగా వాళ్లను శిక్షిస్తామని... ఒక దమ్మున్న నాయకుడుగా సీఎం చట్టం చేసారు'' అని అన్నారు.
read more ఆ ఐఆర్ఎస్ అధికారిపై జగన్ కు వ్యక్తిగత కక్ష... ఎందుకంటే...: వర్ల రామయ్య
''మహిళల రక్షణకు సంబంధించిన ''దిశ చట్టం'' బిల్లును జభలో ప్రవేశపెడితే దాన్ని వదిలేసి ప్రతిపక్షాలు వేరే ఏదో మాట్లాడుతున్నారు. ఈ బిల్లుకు మీరు మద్ధతిస్తారో లేదో చెప్పండి ముందు.'' అంటూ కన్నబాబు టిడిపిని ప్రశ్నించారు.
''సోషల్ మీడియాలో ఎంత భయంకరమైన కుట్ర జరుగుతోందంటే... నాయకుల మీద కాదు వాళ్ల ఇళ్లల్లో ఉన్న కుటుంబ సభ్యులు, మహిళలు మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది.
తప్పుడు ప్రచారం, ఫోటోల మార్ఫింగ్స్ ఇష్టానుసారం చేస్తున్నారు. ఏంటి అధ్యక్షా ఇది. మహిళలకు గౌరవం వద్దా. వారి ఇంట్లో మహిళలకు ఒకటి వేరొకరి ఇంట్లో మహిళలు వేరొక రకమైన న్యాయం ఉంటుందా.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్‌లు చేస్తే రెండు సంవత్సరాలు కఠినంగా శిక్షిస్తాం. రెండో సారి అలాగే తప్పు చేస్తే నాలుగు సంవత్సరాలు శిక్షిస్తాం. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కఠిన చట్టం తీసుకొచ్చింది జగన్ మాత్రమే.మార్పింగ్‌లు ఎంత దారుణంగా ఉన్నాయంటే మనం రాజకీయాల్లో ఉన్న కారణంగానో, మరో ముఖ్యమైన హోదాలో ఉన్న కారణంగానో ఇళ్లల్లో మహిళలను, వారి తల్లుల్ని, భార్యలని, చెల్లెల్ని అవమానిస్తారా... వారికి సిగ్గనిపించడం లేదా.
ఖచ్చితంగా అలాంటి చట్టానికి ఏ వంకలు పెట్టకుండా, ఏ చర్చా లేకుండా ప్రతిపక్షంగా చేయాల్సిన సిఫార్సులు మీరు చేయాలి. అలాగే సీఎం జగన్ ని అభినందించి మీరు(టిడిపి) వెళ్లుంటే మీకు గౌరవం పెరుగుతుంది'' అని మంత్రి వ్యాఖ్యానించారు.
read more అన్నోచ్చాడు... జగనన్న వచ్చాడన్న నమ్మకం కలిగింది...నాకే కాదు...: మంత్రి పుష్పశ్రీవాణి
''ఈ రాష్ట్రంలో మహిళలు కనపడితే కడుపన్నా చేయాలి, ముద్దన్నా పెట్టుకోవాలి అన్నవారు ఈ శాసనసభలో కూడా ఉన్నారు. అవి వాళ్ల పార్టీ నుంచి వచ్చిన సుభాషితాలు. లేదని చెప్పమనండి. అలాంటి సుభాషితాలు చెప్పినవారు ఆ పార్టీలో ఉన్నారు. వాళ్లను వదిలేసారు. ఆవేవీ కనిపించవు.
ఎక్కడో కాగితాలు తీసుకొని రావడం, ఎక్కడ నుంచో చిన్న కటింగ్స్ తీసుకురావడం వాటి గురించి మాట్లాడమే వారికి తెలుసు. ఎక్కడైనా సరే పబ్లిక్ ఒక్కటే కోరుకుంటున్నారు. ఏ అమ్మాయి వంకైనా తప్పుగా చూస్తే వాళ్లను కఠినంగా శిక్షించాలని, అలా చూడ్డానికి భయపడాలని కోరుకుంటున్నారు. చూడ్డానికిభయపడాలంటే చంపేస్తామని కాదు...చట్టపరంగానే శిక్షిస్తాం.
ఒక తప్పు చేస్తే వాడు కనీసం 20 యేళ్లు జైల్లో ఉండాలి లేకపోతే మరణదండన ఉండాలని జగన్ ఇవాళ గొప్ప సంస్కరణకు తెరతీశారు. ఈ రాష్ట్రంలో రేప్ కేసుల నిందితులు ఏ విధంగా ఉన్నారో చూశాం. జైల్లో వాళ్లను సంవత్సరాలు తరబడి అతిధులుగా చూసుకునే పరిస్ధితి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉరిశిక్షలు తక్కువగాపడినయ్ అని చెప్తున్నారు
ఎప్పుడూ న్యాయం ఒకేలా ఉండదు, జనం ఏది కోరుకుంటే అది జరిపించాల్సిన బాధ్యత చట్ట సభల్లో ఉన్న ప్రజా ప్రతినిధులదే'' అనికన్నబాబు వెల్లడించారు.