నంద్యాల: గోదావరి  నదిలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర బోటు ప్రమాదంలో మృతిచెందిన కర్నూల్ జిల్లాకు చెందినవారు కూడా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అయినవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని హామీ ఇచ్చి గతంలోనే ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.   

ఇలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎక్స్ గ్రేషియాకు సంబంధించిన చెక్కులను వైస్సార్సీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తన నియోజకర్గం నంద్యాల పరిధిలోని బాధితులకు అందించారు. మృతి చెందిన ఒక్కొక్కరికి  ఇదివరకే రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వగా తాజాగా మరో రూ. 30 లక్షల రూపాయల చెక్కులను అందించారు. 

ఈ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్డిఓ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

వీడియో కోసం పక్కనున్న లింక్ పై క్లిక్ చేయండి  video news : కచ్చలూరు బోటు ప్రమాదమృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా

గత సెప్టెంబర్ నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులురు పాపికొండల విహారయాత్ర రాయల్‌ వశిష్ట బోటు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన నలుగురు కుటుంబసభ్యులు గల్లంతై మృత్యువాత పడ్డారు. బోటు ప్రమాద మృతులు బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి, అతడి భార్య స్వాతి, పిల్లలు విఖ్యాత్ రెడ్డి (6) హారిక (4) లు ప్రాణాలు వదిలారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.40 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అందించారు. ప్రభుత్వం ఆ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలన్నింటిని ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా పేర్కోన్నారు.

read more  పొలిటికల్ కరెప్షన్ ఓకే... వారి అవినీతే తగ్గాలి...: మంత్రులతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు