కడప: ప్రాంతీయ పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమేనన్నారు. ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని తేల్చి చెప్పారు. అందువల్లే తాను జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరినట్లు స్పష్టం చేశారు. 

రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు.ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని స్పష్టం చేశారు. ఇకపోతే దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో జమిలి ఎన్నికలు వస్తాయని ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రమేష్. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ న్యాయవాదుల సదస్సులో జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జమిలి ఎన్నికలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కొద్దిసేపట్లోనే సీఎం రమేష్ వ్యాఖ్యలు చేయడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

చదువుకున్న వాళ్లకే కులపిచ్చి, జమిలి ఎన్నికలకు ఛాన్స్: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు