భార్య, కూతురిని అతి కిరాతకంగా హత్య చేసి... అనంతరం రైలు కింద పడి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖలో చోటుచేసుకుంది. కాగా... ముగ్గురి మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....విశాఖ నగరానికి శుక్రజిత్ కి 2017 జనవరి 22న సుమాంత్  అనే యువితో వివాహమైంది. వీరికి 2018 నవంబర్ లో హర్షిత అనే కుమార్తె  జన్మించింది.. కాగా శుక్రజిత్  భార్య, బిడ్డలతో కలిసి బింద్రానగర్ జాహ్నవి ఎన్ క్లేవ్ లో నివసిస్తున్నాడు. కాగా... ఇటీవల శుక్రజిత్ మద్యానికి బానిసగా మారాడు. ఆడ పిల్ల పుట్టిందంటూ భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.

తరచూ భర్త వేధించడంతో తట్టుకోలేక సుమాంత్ ఇటీవల పుట్టింటికి వెళ్లింది. అయితే... తల్లిదండ్రులు ఆమెకు నచ్చచెప్పి ఇంటికి పంపించారు. కాగా.. ఈనెల 19వ తేదీన శుక్రజితద్... తన ఇంట్లో భార్యను దారుణంగా కొత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం కుమార్తెను ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య, బిడ్డలను చంపేశానంటూ ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు.

అనంతరం  ఒడిశా వెళ్లి అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా... ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.