విశాఖ: టిడిపి నేత, గీతం విద్యా సంస్థల చైర్మన్ శ్రీభరత్ సోషల్ మీడియా వేదికన వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఇటీవల బ్యాంకులను ఎగ్గొట్టడాపికి శ్రీభరత్ ప్రయత్నిస్తున్నారన్న విజయసాయి ఆరోపణలకు భరత్ ధీటుగా సమాధానమిచ్చారు. బ్యాంకుల్లో తన లావాదేవీలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తే శ్రీభరత్ ఆయనకు సుధీర్ఘమైన లేఖను రాశారు. 

విజయనగరం జిల్లా గరివిడిలో తమకున్న విబిసి సోలార్ ఎనర్జీ పేరుతో బ్యాంకులో రుణం తీసుకుని ఎగ్గొట్టినట్లు విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను ముందుగా భరత్  గుర్తుచేశారు. ప్రజల సొమ్ము దోచుకున్నట్లు విజయ్ సాయి రెడ్డి మాట్లాడడం తగదంటూనే తన రుణాలకు సంబంధించిన  వివరాలను వెల్లడించారు.

గతంలో తాను ఆంధ్ర బ్యాంకు వద్ద 15.3 కోట్లు రుణం తీసుకున్న మాట నిజమేనన్నారు. ఇప్పటికే రెండు కోట్లకు పైబడి సొమ్మును వాయిదాల పద్దతిలో బ్యాంకుకు తిరిగి చెల్లించినట్లు భరత్ వెల్లడించారు. ఇంకా రూ. 13.65  కోట్లు మాత్రమే సదరు బ్యాంకుకు చెల్లించాల్సివుందన్నారు. 

చంద్రబాబు ఫ్యామిలీలో టెన్షన్: హీరో బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ కు షాక్, ఆస్తులు స్వాధీనం

తమ సోలార్ ప్లాంట్ లో ఉత్పత్తయే విద్యుత్ ను ప్రభుత్వ సంస్థ ట్రాన్స్‌కో  కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వమే తమ సంస్థకు మూడు కోట్ల రూపాయలు బకాయి చెల్లించాల్సి ఉందని శ్రీభరత్ పేర్కొన్నారు.

గతంలో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు బాగోలేని నేపథ్యంలో అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ తమకు రావాల్సిన బకాయిలను చెల్లించలేకపోయిందన్నారు.   తాము కూడా రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని సంయమనం వహించినట్లు తెలిపారు. 

ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా, ఒక ఆడిటర్ గా ఆర్థిక సమస్యల గురించి మీకు చాలా మంచి అవగాహన ఉంటుంది. కానీ మీరు ఇలాంటి విమర్శలు చేశారు కాబట్టే తాను స్పందించాల్సి వచ్చిందపి శ్రీభరత్ పేర్కొన్నారు. 

మీరు ఇలాంటి విమర్శలు చేయడం చాలా బాధాకరంగా వుందన్పనారు. తమరి సలహాలు, సూచనలు రాష్ట్రంలో  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను ప్రోత్సహించి విధంగా ఉండాలని, తనలాంటి వారిని అవమాన పరిచేలా వ్యవహరించవద్దని విన్నవించుకుంటున్నాను అని విజయసాయి రెడ్డికి  శ్రీభరత్ సూచించారు.
 
ఇటీవలే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కు ఆంధ్రాబ్యాంక్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాబ్యాంక్ కు శ్రీభరత్ సుమారు 13కోట్లకు పైగా బకాయి పడటంతో ఆస్తుల వేలానికి ఆంధ్రాబ్యాంక్ నోటీసులు జారీ చేసింది. 

శ్రీభరత్ ఆస్తుల స్వాధీనంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం రూ. 13 కోట్లకుపైగా బకాయి పడిందని ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చిందని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీలోకి పంపిన వాళ్లంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనే శ్రీభరత్ తాజాగా స్పందించారు.