Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు షాక్ ఖాయమేనా...? రామ్ మాధవ్ తో గంటా భేటీ

తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తప్పేలా లేదు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఆ పార్టీని చాలామంది కీలక నేతలు వీడగా అదే బాటలో మరో సీనియర్ లీడర్, మాజీ మంత్రి నడిచేలా కనిపిస్తున్నారు.  

Ex Minister Ganta Srinivasa Rao meeting with bjp leader ram madhav
Author
Amaravathi, First Published Nov 9, 2019, 8:21 PM IST

అమరావతి: తెలుగు దేశం పార్టీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి షాకిచ్చేందుకు బిజెపి పార్టీ రంగం సిద్దం చేస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో ఇప్పటికే బిజెపి నేతలు మంతనాలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా గంటా డిల్లీలో బిజెపి జాతీయ ప్రదాన కార్యదర్శి రాంమాధవ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ గంటా టిడిపిని వీడి భారతీయ జనతా పార్టీలో చేరతాడన్న ప్రచారానికి మరింత బలాన్నిస్తోంది. 

ప్రస్తుతం డిల్లీ పర్యటనలో వున్న గంటా శ్రీనివాసరావు తాజాగా రామ్ మాధవ్ ను కలుసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో ముఖ్యంగా టిడిపి లో రాజకీయ వాతావరణ వేడెక్కింది. ఈ భేటీకి సంబంధించిన వివరాలేవీ బయటకు రాకున్నా బిజెపి చేరేముందు తన డిమాండ్లను రామ్ మాధవ్ ముందుంచేందుకే గంటా కలిసినట్లు ప్రచారం సాగుతోంది.  

 read more  ఏపీలో చంద్రబాబుకు మరో షాక్: టీడీపీకి సాధినేని యామిని రాజీనామా

గత గురువారం  కూడా గంటా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో కీలక మంతనాలు జరిపారు. గంటాతో పాటు ఎంతమంది బీజేపీలో చేరతారన్న విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ వారు బీజేపీతో చేతులు కలిపితే అనర్హత వేటు పడడం, ఇతర న్యాయపరమైన అంశాల గురించి వారు చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న గంటా సుజనా, సీఎం రమేశ్‌తో కూడా చర్చలు జరిపారు.

ఇదిలా ఉండగా.... ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు టీడీపీ ని వీడారు. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పార్టీకి రాజీనామా చేశారు. ఆమె ఈ నెల 10వ తేదీన బిజెపిలో చేరే అవకాశాలున్నాయి. తన రాజీనామా లేఖను ఆమె చంద్రబాబుకు పంపించారు.

read more  చంద్రబాబుకి మరో షాక్.... బీజేపీలోకి గంటా

సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సాధినేని యామిని కూడా రాజీనామా చేశారు. జూపల్లి ప్రభాకర్ రావు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం కావాలని చూస్తున్న బిజెపి టీడీపీ, ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. పలువురు టీడీపీ నాయకులు ఇంకా బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడంలో సాధినేని యామిని కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీపై విమర్శలు కురిపిస్తూ వచ్చారు. గత కొంత కాలంగా మౌనం వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios