నేనసలు ఏమన్నానంటే... బాస్టర్డ్ వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ...
ఐదోరోజయిన ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశం ప్రారంభంతోనే దద్దరిల్లింది.గురువారం ప్రతిపక్ష టిడిపి, అసెంబ్లీ మార్షల్స్ మధ్య చోటుచేసుకున్న పరిణామలపై సభ దద్దరిల్లింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపదోపదాలతో సభ దద్దరిల్లింది. గురువారం సమావేశ ప్రారంభ సమయంలో టిడిపి నాయకులను అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకోవడంపై ప్రధానంగా చర్చ సాగింది. ఈ సందర్భంగా తమతోమ మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారంటూ ప్రతిపక్షం, మార్షల్స్ ను టిడిపి నాయకులు అవమానకరంగా దూషించి దాడికి ప్రయత్నించారంటూ అధికార పార్టీ వాదోపవాదాలకు దిగారు. దీనిపై ఇరుపక్షాల వాదోపవాదాలతో సభ దద్దరిల్లింది.
ఈ క్రమంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మార్షల్స్ ని బాస్టర్డ్ అంటూ దూషించారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఓ ప్రభుత్వం అధికారిని అవమానించే మాట్లాడిన ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు మార్షల్స్ ను దూషిస్తున్న వీడియోను అధికార పార్టీ సభలో ప్రదర్శించింది.
read more సభలో వైసీపీకి టీడీపీ ట్విస్ట్: జగన్ పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు
దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు వివరణ ఇచ్చుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మార్షల్స్ ను దూషించలే దన్నారు. తనను ప్రశ్నిస్తున్న వారితో ''నో క్ంశ్చన్'' అని అన్నానని... దాన్ని బాస్టర్డ్ గా మార్చి ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన నోటి నుండి ఎప్పుడు భూతులు రావని...ఏదయినా కోపం వస్తే గట్టిగా మాట్లాడతానని చంద్రబాబు వివరణ ఇచ్చుకున్నారు.
లేని దాన్ని ఉన్నట్లుగా అసెంబ్లీలో చూపించాలని అధికార పక్షం ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలా దాదాపు మూడు గంటల పాటు తాను అనని దాన్ని అన్నట్లు చిత్రీకరించారని... దీన్ని సీరియస్ గా తీసుకుంటూ సీఎంపై ప్రివిలీజ్ మోషన్ ఇస్తామని చంద్రబాబు హెచ్చరించారు.
read news దిశ చట్టం నేరస్తులకు సింహస్వప్నం: మంత్రి తానేటి వనిత
సీఎం జగన్ దగ్గరుండి మూడుగంటల పాటు సభను పక్క దారి పట్టించినందుకు ప్రయత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎంపై ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వ చర్య దుర్మార్గంగా వుందని...ఇది ఖచ్చితంగా ఉన్మాద చర్యేనని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే లు అసెంబ్లీకి రాకూడదా?వాళ్ళు ఏమైనా దొంగలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.