కడప: దేశ రక్షణ కోసం కేంద్ర  ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాల్సిన అవసరం వుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. బిజెపి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాక దేశ, ప్రజా సంక్షేమం కోసం అనేక సంస్కరణలు, పరివర్తనలు తీసుకోచ్చామని... ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందన్నారు. 

కేంద్ర మంత్రి షెకావత్ శనివారం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. 

భారత భూభాగమైన కాశ్మీర్ లో 390 ఆర్టికల్ రద్దు చేసిన అన్ని రాష్ట్రాలు సమానమేనని చాటిన ఘనత మోడీదేనని అన్నారు. మైనారిటీ దేశాల్లో అమలు చేయని త్రిబుల్ తలాక్ చట్టాన్ని కూడా తెచ్చామన్నారు. భారతదేశ భద్రత కోసం చట్టాలను తెస్తే వ్యతిరేకిచడం తగదన్నారు.

read more  టిడిపికి మరో షాక్... బిజెపి గూటికి కీలక నాయకురాలు

ముస్లీం దేశమైన పాకిస్థాన్ లో హిందువులను ఉండనివ్వడం లేదన్నారు. ఆ దేశంలో పది లక్షల మంది శరణార్ధులుగా ఉన్నారన్నారు. అక్కడ సిటిజన్ షిప్ కోసం 11ఏళ్ళ పాటు వేచిఉండాల్సి ఉంటుందని... పౌరసత్వం కోసం  11ఏళ్ళుగా ఎదురు చూస్తున్న హిందూ శరణార్థులకు కనికరించడం లేదన్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేక పిల్లలను చదివించుకోలేక శరణార్థులు నానాఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంటే కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ నడుస్తున్నారని ఆరోపించారు. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యల  గురించి మైనారిటీ వర్గాల్లో దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అశాంతిని సృష్టిస్తోందని కేంద్ర  మంత్రి పేర్కొన్నారు. శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకే కొత్త చట్టాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 

తాము ఇటీవల  తీసుకున్న నిర్ణయాలపై తప్పుడు ప్రచారం సాగుతోందని... అందువల్ల ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ఇంటింటి వెళ్తామన్నారు. సిఎఎకి మద్దతు తెలిపేందుకు 8866288662 పోన్ నంబర్ కు మిస్డ్ ఇవ్వాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.

బిజెపి బారీ సభ్యత్వం ఉన్న పార్టీ అని గుర్తుచేశారు. తమకు పది కోట్ల మంది ప్రజల మద్దతు ఉందని... మమతా, రాహుల్, ఎంఐఎం పార్టీలు ఏమి చేయలేవన్నారు. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ కు అందరూ మద్దతు పలకాలని... విదేశాల్లో ఉన్న రాహుల్ గాంధీ కి వినిపించేలా భారత్ మాతకు జై అని నినాదాలు చేయాలని కేంద్ర మంత్రి షెకావత్ కడప ప్రజలకు సూచించారు.  

కృష్ణా : కృష్ణా జిల్లా జి. కొండూరు మండలం మునగపాడులో గురువారం దారుణం చోటుచేసుకుంది. మూడా బాలు అనే వ్యక్తి 45 సంవత్సరాల మహిళపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడి ఆపై మర్మాంగాన్ని కోసేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న బాధితురాలిని వైద్య పరీక్షల నిమ్మిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని  పేర్కొన్నారు. కాగా బాధితురాలు నిందితుడికి చిన్నమ్మ వరుస అవుతుందని పోలీసులు వెల్లడించారు.