video: మూడేళ్లలో 20వేల ఉద్యోగాల భర్తీ...: బ్రాండిక్స్ సీఈవో వెల్లడి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగావకాశాలు  కల్పించనున్నట్లు బ్రాండిక్స్ సంస్థ సీఈవో అశ్రోఫ్ అమర్ ప్రకటించారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి  గౌతమ్ రెడ్డిని కలిసిన ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.  

Brandix CEO Ashroff Omar met the Minister for Industries M Goutham Reddy

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి  గౌతమ్ రెడ్డిని బ్రాండిక్స్ సంస్థ సీఈవో అశ్రోఫ్ అమర్ కలిశారు. తన సంస్థకు చెందిన ప్రతినిధుల బృందం కలిసి బ్రాండిక్స్ విస్తరణ, కంపెనీలో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం సహకారం అందిస్తే సంస్దను విస్తరించి భారీగా పెట్టుబడులు పెట్టడంతో పాటు స్థానియ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అశ్రోఫ్ వివరించారు. 

ప్రభుత్వంతో కలిసి పారిశ్రామికవృద్ధిలో భాగస్వామ్యమవనున్నట్లు వెల్లడించిన బ్రాండిక్స్ సంస్థకు తమ సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. ఆ సంస్థ ఎదుర్కొంటున్న సమస్యలను తీరుస్తామని... విస్తరణకు ప్రభుత్వం నుంచి  అన్నిరకాలుగా సహకారం అందిస్తామని మంత్రి మేకపాటి హామీ ఇచ్చారు.

వీడియో

"

ఇప్పటికే 98 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తున్నామని అశ్రోఫ్ ఒమర్ మంత్రికి తెలిపారు. ఇకపై కూడా ఉద్యోగావకాశాలను పెంచడమే లక్ష్యంగా బ్రాండిక్స్ దూసుకెళుతుందని సీఈవో అన్నారు. 

read more  తప్పని తిప్పలు... క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే

రాష్ట్రంలోని యువతకు భారీ ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 3 దశలలో మూడేళ్లలో 20వేల మందికిపైగా ఉద్యోగాలందిస్తామని తెలిపారు. రాబోయే ఏడాది కాలంలో 5-7వేల మందికి ఉద్యోగాలిస్తామని... ఇలా మూడేళ్లపాటు ఈ నియామక ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు. 

ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గార్మెంట్స్ పాలసీ రూపొందించేందుకు బ్రాండిక్స్ సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలలో అపరల్ పార్కులు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచుతామన్న మంత్రి మేకపాటి వెల్లడించారు. 

read more  దిశ చట్టం వల్లే మరో యువతిపై అత్యాచారం... చంద్రబాబు ఆరోపణలపై మంత్రి సీరియస్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios