Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్‌ కమిటీ సంస్కరణలు... జగన్ ప్రభుత్వ కీలక ప్రకటన

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి నియోజకవర్గంలో ఓ మార్కెట్ కమిటీ వుండాలన్ని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఆచరణలోకి వచ్చా యి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకున్న కమిటీలతో పాటు మరో 25 నియోజకవర్గాల్లో నూతనంగా కమిటీలను ఏర్పాటు చేసింది.  

AP Governnment released go on agriculture market committees appointment
Author
Amaravathi, First Published Dec 14, 2019, 2:33 PM IST

అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెటింగ్  అధికారులు ఇటీవల మార్కెట్‌ కమిటీల పునర్వ్యస్థీకరణను పూర్తి చేశారు. దీంతో ఇక కమిటీల నియామకమే మిగిలిపోవడంతో వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది.

ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక మార్కెట్‌ కమిటీ ఉండాలని... ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఆదేశించారు. దీంతో  ఇప్పటివరకు మార్కెట్‌ కమిటీలు లేని 25 నియోజకవర్గాల్లో నూతనంగా కమిటీలను ఏర్పాటు చేయనుంది. దీంతో  మొత్తం కమిటీల సంఖ్య 191 నుంచి 216కు పెరిగింది. 

అన్ని వ్యవసాయ కమిటీలను ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్, సహకారశాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమికంగా జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో గుంటూరులోని మార్కెటింగ్‌శాఖ స్పెషల్‌ కమిషనర్‌కు తెలియ చేయాలని కోరారు.

read more  అమ్మాయిలను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్: ఒకరిని రేప్ చేసిన సోదరుడు

216 కమిటీల్లో 50 శాతం మహిళలకు, మిగిలిన 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వచ్చే విధంగా రిజర్వేషన్లు పాటించాలని సూచించారు. ఈ మేరకు మొత్తం 216 కమిటీల్లో 108 కమిటీలకు మహిళలు చైర్‌పర్సన్లుగా నియమితులు కానున్నారు. 50 శాతం నామినేటెడ్‌ పోస్టులను మహిళలకు రిజర్వు చేస్తానన్న ముఖ్యమంత్రి హామీ ఈ ఉత్తర్వుల ద్వారా ఆచరణలోకి రానుంది.

ఒక్కో మార్కెట్‌ కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షుడిగానూ, నలుగురు అధికారులు, ముగ్గురు వ్యాపారులు, 12 మంది రైతులు సభ్యులుగానూ ఉంటారు. వీరిలో రైతులు, వ్యాపారులకు ఓటు హక్కు ఉంటుంది. వీరే కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. 

read more ఇసుక అక్రమ రవాణాకు చెక్...బార్డర్లలో నిఘానేత్రం

నిబంధనల ప్రకారం కమిటీ ఏర్పాటయితే ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఈ నెలాఖరులోపు పూర్తవుతుందని మార్కెటింగ్, మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios