బ్రేకింగ్ న్యూస్... ఏపి ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ రాజీనామా
ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు ఒక్కోక్కరుగా రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో రాజీనామా ప్రకటన వెలువడింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టిడిపి హయాంలో నియామకం జరిగిన పదవులన్నీ ఒక్కోటిగా ఖాళీ అవుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొందరు స్వతహాగా రాజీనామా చేయగా మరికొందరు ఒత్తిడిని తట్టుకోలేక రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో పదవి ఖాళీ అయ్యింది.
ఏపీ స్టేట్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి కారం శివాజీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంపిన ఆయన వెంటనే ఆమోదించాల్సిందిగా కోరారు.
read more ఇది నా నైతిక బాధ్యత... పదవికి రాజీనామా చేసిన నన్నపనేని
వైసిపి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు తరువాత కారం శివాజీ ఆరునెలల పాటు ఇదే పదవిలో కొనసాగారు. అయితే టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవులు పొందినవారు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్న క్రమంలో కారం శివాజీ తాజాగా తన పదవిని వదులుకున్నారు.
ఇటీవలే మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి కూడా రాజీనామా చేశారు. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పదవిని పొందాము... ఇప్పుడు వైసిపి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.
read more దిగొచ్చిన పుట్టా సుధాకర్ యాదవ్: టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా
ఈ క్రమంలో మూడేళ్ల వార్షిక నివేదికను నన్నపనేని గవర్నర్ కి అందజేశారు. తన నివేదికను చూసి గవర్నర్ అభినందించినట్లు ఆమె చెప్పారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదికగా అడ్డంగా మారిందన్నారు. తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానని ఆమె చెప్పారు.వసతి గృహాల్లో భద్రత పెచాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్ట పరచాలని సూచించారు.