జగన్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్ట్... కీలక ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జగన్ ప్రభుత్వానికి షాకిచ్చింది. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది.  

andhra pradesh high court give to shock jagans government

అమరావతి: జగన్ ప్రభుత్వానికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నియమించబడిన ఆలయ కమిటీలను కొనసాగించాలంటూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆలయ కమిటీల పదవీకాలం పూర్తయ్యేవరకు నూతన కమిటీలను ఏర్పాటు చేయవద్దని... ఇప్పుడున్న వాటినే కొనసాగించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

టిడిపి ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఆలయ కమిటీలను రద్దు చేస్తూ వైసిపి ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో  బెజవాడ దాసాంజనేయ,  రంగనాథ స్వామి ఆలయ కమిటీ, పెనుగంచి ప్రోలు ఆలయ కమిటీ,  శ్రీశైల ఆలయ కమిటీలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై గతకొంత కాలంగా విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తుది తీర్పును వెలువరించింది. 

read more బాలినేని జన్మదిన వేడుకలు: జగన్ తో రోజా సెల్ఫీ (ఫొటోలు)

ఏపీలోని ఈ నాలుగు దేవస్థానాల ట్రస్ట్ బోర్డులకు కాల పరిమితి పూర్తయ్యే వరకు కొనసాగేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినెటెడ్ పదవుల భర్తీని చేపట్టింది. ఈ క్రమంలోనే టిడిపి హయాంలో ఏర్పాటుచేసిన ఆలయ కమిటీలను రద్దుచేసి నూతన  కమిటీల ఏర్పాటుకు రంగం సిద్దం చేసింది. ఇందుకోసం జీవోను కూడా జారీచేసింది. 

అయితే తమ పదవీకాలం ఇంకా మిగిలివుండగానే ప్రభుత్వ నిర్ణయంతో అన్యాయం జరుగుతోందంటూ కొన్ని ఆలయ కమిటీల సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.  దీంతో పిటిషన్ దారులు, ప్రభుత్వ వాదనను విన్న న్యాయస్థానం చివరకు ఆలయకమిటీ  వాదనతోనే ఏకీభవించింది. దీంతో వెంటనే ఆయా ఆలయ కమిటీలను పునరుద్దరించి సభ్యుల పదవీకాలం ముగిసేవరకు కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

read more మార్కెట్ యార్డుల్లో ఇసుక రాశులు... అందువల్లే ప్రస్తుత పరిస్థితి: జగన్ పాలనపై దేవినేని ఫైర్

దీంతో తమవారికి ఆలయ కమిటీల బాధ్యతలు అప్పగించాలన్న ప్రభుత్వ ఆలోచనకు బ్రేకులు పడ్డాయి. హైకోర్టు తీర్పుపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios