అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నాహాలు జరుగుతున్న సమయంలో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీలు చేపట్టింది. మేరకు వైసీపీ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

హోంగార్డ్ ఏడీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ గా నియమితులయ్యారు. విశాఖ సీపీ ఆర్కే మీనాకు అడిషినల్ డీజీగా పదోన్నతి కల్పించి సీపీగానే కొనసాగించారు. వెయిటింగ్ లో ఉన్న హరికుమార్ కు డీజీపీ కార్యాలయంలో న్యాయ విభాగం ఐజీగా పోస్టింగ్‌ దక్కింది. 

ఎస్‌ఐబీ డీఐజీ శ్రీకాంత్ కు ఐజీగా పదోన్నతి ఇచ్చి అదే స్ధానంలో  కొనసాగించారు. ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్ కు ఐజీగా పదోన్నతి ఇచ్చి మెరైన్ ఐజీగా బదిలీచేశారు. సీఐడీ డీఐజీ ప్రబాకర్ రావుకు  కూడా ఐజీగా పదోన్నతి ఇచ్చి గుంటూరు రేంజ్ కు బదిలీచేశారు. గుంటూరు ఐజీ వినిత్ బ్రిజ్ లాల్ ను శాండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు బదిలీ  చేశారు. ఆయనకే ఎక్సైజ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ గా అదనపు బాద్యతలు అప్పగించారు. 

read more  హౌసింగ్ కార్పొరేషన్ లో లంచగొండి అధికారి..వలవేసిన ఏసీబీ అధికారులు...

విజయవాడ జాయింట్ సీపీ నాగేంద్రకుమార్ ను పదోన్నతిపై ఐజీ పీ&ఎల్ కు బదిలీ చేశారు. సీఐసెల్ ఎస్పీ కే .రఘరామరెడ్డికి డీఐజీగా పదోన్నతి ఇచ్చి అదే స్ధానంలో కొనసాగించారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ అశోక్ కుమార్ కు కూడా డీఐజీగా పదోన్నతి లభించి అదే స్ధానంలో కొనసాగించారు. 

ఇంటిజిలెన్స్ ఎస్పీ జీ.విజయ్ కుమార్ కు డీఐజీగా పదోన్నతి కల్పించారు... డీసీపీ విజయవాడ అడ్మిన్ హరికృష్ణకు డీఐజీగా పదోన్నతి కల్పించి సీఐడీకు బదిలీ చేశారు. ఎస్‌ఐబీ ఎస్పీ రవిప్రకాష్ డీఐజిగా పదోన్నతి లభించింది. ఆయనను ఏసీబీకి బదిలీ చేశారు. రాజశేఖర్ బాబుకు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ హెడ్ క్వాటర్స్ లా&ఆర్టర్ కోఆర్డినేటర్ గా బదిలీ చేశారు. 

ఇంటిలిజెన్స్ ఎస్పీ కే.వి మోహన్ రావు డీఐజీగా పదోన్నతి కల్పించి ఏలూరు రేంజ్ డీఐజీగా బదిలీ చేశారు. గుంటూరు ఎస్పీ పీహెచ్ డీ రామకృష్ణకు డీఐజిగా పదోన్నతి  కల్పించి అదే స్ధానంలో కొనసాగించారు. పార్వతిపురం ఏఎస్పి గరుడ్ స్మిత్ సునీల్ ను నర్సిపట్నం ఓఎస్డీకి బదిలీ చేశారు. 

read more  కర్నూల్ వైసీపీలో అధిపత్య పోరు: రాజీనామా యోచనలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్

వేకెన్సీలో ఉన్న బీ కృష్ణారావును ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ కామాడెంట్ కు బదిలీచేశారు.  చింతూరు ఓఎస్డీగా ఉన్న అమిత్ బర్డార్ ను కాకినాడ 3rd బెటాలియన్ కామాండెంట్ కు, బొబ్బిలి ఎఎస్పీ గౌతమి సాలి అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కర్నూల్ కు బదిలీ చేశారు.