కర్నూల్: అవినీతి నిరోదక శాఖ అధికారుల వలలో మరో అవినీతి చేప చిక్కింది. కర్నూల్ పట్టణానికి చెందిన సబ్ రిజిస్ట్రార్ మహబూబ్ అలీ కార్యాలయంలోని మరో అధికారి సహకారంతో లంచాన్ని స్వీకరిస్తుండగా ఏసిబి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.  

కర్నూల్ లో హిమాలయ కంపనీకి చెందిన వస్తువుల అమ్మకం కోసం పి.జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫ్రాంచైజ్ షాపును కలిగి ఉన్నాడు. అతడు సదరు కంపనీతో గతంలో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అయితే లీజు డీడ్ ఒప్పందం యొక్క రిజిస్ట్రేషన్ పనిపై అతడు పట్టణంలోని  సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళాడు. 

read more విషాదం... కరెంట్ షాక్ కు కుటుంబం మొత్తం బలి

తన పనికి సంబంధించిన అధికారిక పత్రాలు సమర్పించాడు. అయితే రిజిస్ట్రేషన్ క్రమబద్ధీకరణ కోసంసబ్ రిజిస్ట్రార్ మహబూబ్ అలీ రూ.8 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో జగన్ ఏసిబి ని ఆశ్రయించాడు. 

ఈ క్రమంలో రిజిస్ట్రార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోడానికి ఏసిబి అధికారులు వలపన్నారు. షేక్ సమీర్ బాషా అనే ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా  జగన్ మోహన్ రెడ్డి నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

read more కాకినాడలో పవన్ శంఖారావం: రైతు సమస్యలపై ఈనెల 12న దీక్ష

అనంతరం సబ్ రిజిస్ట్రార్ పట్టిక నుండి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రైడ్ లో పట్టుబడ్డ ఇద్దరినీ ఏపిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.