అమరావతి: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గళమెత్తుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు నిరసన దీక్ష చేపట్టనున్నారు. 

రైతుకు గిట్టుబాటు ధర కల్పించకపోతే ఈనెల 12న కాకినాడ కలెక్టరేట్ దగ్గర నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించిన పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగానే దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడటమే దీక్షయెుక్క ముఖ్య ఉద్దేశమని జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు ఇచ్చారు.  

ప్రతి ఒక్క జనసైనికుడు కాకినాడ చేరుకొని అద్యక్షుడు పవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని జనసేన ఆవేదన వ్యక్తం చేసింది. 

ఆయనకి ముగ్గురు పెళ్లాలు, నాకు ఒక్కతే భార్య: పవన్ పై జగన్ సెటైర్

వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ఉభయ గోదావరి జిల్లాల రైతులు కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు. 

రైతులకు బాసటగా నిలించేందుకు ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో పవన్ కళ్యాణ్ నిరసన దీక్షకు దిగనున్నారు. ఇకపోతే తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రైతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి మూడు రోజులు డెడ్ లైన్ విధించారు. డెడ్ లైన్ విధించి ఒక్కరోజు కూడా గడవక ముందే దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 

మీవల్లే ఓడిపోయాం, ఇకనైనా మారండి: అభిమానులపై పవన్ ఆగ్రహం