Asianet News TeluguAsianet News Telugu

దినఫలాలు: మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి

ప్రముఖ జ్యోతిష్కుడు ఈ రోజు రాశిఫలాలను అందించారు. ఈ రోజు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి.

Today dinaphalithalu, 30th august
Author
hyderabad, First Published Aug 30, 2020, 7:50 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వీలైనంతవరకు కోపతాపాతాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉండాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. అభివృద్ధి కోసం మీరు చేసే శ్రమ ఫలిస్తుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. చర్చలు సఫలం అవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు  ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు స్వల్ప మార్పులు ఉంటాయి.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు స్థిరమైన నిర్ణయాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. మనసు పెట్టి పనిచేయాలి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వీలైనంతవరకు కోపతాపాలకు దూరంగా ఉండండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహం లభిస్తుంది. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగార్థులు ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు వ్యవహార్లో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ముందు చూపుతో వ్యవహరిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వివాహ ప్రయత్నాలు సాగిస్తారు. వస్తు కొనుగోలు ఉంటుంది. చేపట్టే పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. వీలైనంతవరకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో ప్రోత్సాహం లభిస్తుంది.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి.చేపట్టిన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. సంఘంలో గౌరవంతో పాటు మర్యాద కూడా లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. 
పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులు, సన్నిహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios