Asianet News TeluguAsianet News Telugu

రాశులు: సెప్టెంబర్ 1వ తేదీ దిన ఫలితాలు

సెప్టెంబర్ 1వ తేదీన మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకోండి.. ప్రముఖ జ్యోతిష్కుడు డా. యంఎన్ ఆచార్య మీకోసం ఈ రాశిఫలాలు అందిస్తున్నారు.

Today dina phalithalu, september 1st
Author
Hyderabad, First Published Sep 1, 2020, 6:44 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Today dina phalithalu, september 1st

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు స్వల్ప ధనలాభం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. మీ పేరు ఉన్నత పదవికి సిఫార్సు చేస్తారు. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకుని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల వల్ల లాభాలు వస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు గతంలో పొదుపు చేసిన ధనం ఇప్పుడు ఉపయోగపడుతుంది. బంధుమిత్రులతో కలహాలు లేకుండా చూసుకోవాలి. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. స్త్రీల సహాయసాకారాలు లభిస్తాయి, సేవాసంస్థలకు హితోధిక సహాయం చేస్తారు. ఉద్యోగంలో చికాకులు సమసిపోతాయి.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మీద ఉన్న నమ్మకాన్ని గుడ్ విల్ మరింత బలపరచుకుంటారు. సంతానం కోసం అధికంగా ఖర్చు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు ప్రతి విషయంలోనూ ఎంతో కొంత స్వంత లాభం పొందుతారు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మొదలు పెట్టిన పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు కలిగిన బాటలో మీ ప్రమేయం లేకుండానే ప్రయాణిస్తారు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు స్వల్ప అనారోగ్య సూచన ఉంది. క్రీడారంగంలోని వారికి ప్రఖ్యాతి లాభిస్తుంది. భూముల కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తనఖా వస్తువులు విడిపిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.  బుద్ధిబలం బాగుంటుంది. అధికారుల సహకారం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు అనేకాంశాల్లో అనుభవం మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉన్నాధికారులతో సంబంధాలను బలపరచుకుంటారు. మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడి అనుకున్నది సాధిస్తారు. స్నేహితులకు మీ వంతు సహాయసాకారాలు అందిస్తారు. కుటుంబ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారు.  మనోబలంతో ముందుకు సాగుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు  విద్యా సంబంధిత విషయాల్లో కృషి ఫలిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. పొదుపుపై దృష్టిసారించి మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది. రుణాలు తీరుస్తారు. సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తత అవసరం. నామినేటెడ్ పదవులు లభించే సూచనలు ఉన్నాయి. ప్రజాసంబంధాలు బాగుంటాయి. మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది. దూరప్రాంత వ్యవహారాలు అనుకూలం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం. వృత్తి, ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. విశ్వాసమైన మనస్సుతో ముందుకు సాగితే కష్టాలు తగ్గుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు  వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. విదేశీయాన వ్యవహారాలు సానుకూలపడతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. మీపై వైరి వర్గం చేసే ప్రచారాలు మీ మీద ఏ మాత్రం ప్రభావం చూపవు. విందు వినోద కార్యక్రమాల్లో సంతోషంగా గడుపుతారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఒడిదొడుకులు తొలుగుతాయి. ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి. వీటిని నేర్పుగా ఉపయోగించుకోండి. సమయానికి సహాయం చేసేవారున్నారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios