Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 6 అక్టోబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి... 

today  6th october raasi palals
Author
Hyderabad, First Published Oct 6, 2020, 7:19 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఇంట్లో ప్రతి ఒక్కరి మద్దతు, ప్రేమ పొందుతారు. వీలైనంత వరకు వివాదాలు దూరంగా ఉంటే మంచిది. మీకు ప్రత్యేక గౌరవం పొందుతారు. భౌతిక అభివృద్ధి మీకు మంచిది. అంగారకుడి స్థితి వల్ల కుటుంబ సహకారంలభిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు కుటుంబంలో ఆనందకరమైన మార్పు కావాలని కోరిక ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. సహచరుల నుంచి మద్దతు ఉంటుంది. మనస్సు పలు ఆలోచనలు ఉంటాయి. మనస్సు ఆనందంగా ఉంటుంది. చట్టపరమైన వివాదాల్లో చిక్కుకోవడం మానుకోండి. ఆన్ లైన్ పోటీల్లో విజయం సాధించే అవకాశముంది. రోజు చివరి భాగంలో సమస్యలు ఉన్నప్పటికీ శక్తి పెరుగుతుంది.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా మానసిక ప్రశాంతత అందుకుంటారు. వ్యాపారంలో నూతన ప్రణాళికలు ఉంటాయి. సీనియర్ అధికారుల నుంచి మద్ధతు లభిస్తుంది. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడిని చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. సృజనాత్మకమైన పని పూర్తి చేసేందుకు సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కుటుంబంలో ముఖ్యమైన వివాదాలు జరుగుతాయి. వ్యాపారంలో భాగస్వాములు అభిప్రాయాలు తీసుకుంటారు. ఇందుకు వారు కూడా సహకరిస్తారు. అంకితభావంతో మీరు పనిచేస్తారు. ఫలితంగా ఈ సమయంలో ఆనందంగా గడుపుతారు. అసంపూర్తిగా ఉన్న వ్యాపారాన్ని పరిష్కరించుకోగలుగుతారు. స్నేహితుల సాయంతో ఈ రోజు మీరు పెద్ద పనిని చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మీరు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక, విద్య, ధార్మిక విషయాల్లో కొంత సమయం తీసుకుంటారు. సీనియర్ అధికారుల మీ పనికి అంతరాయం కలిగిస్తారు. పని విషయంలో ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశముంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు  జాగ్రత్తగ ఉండాలి. మీ చుట్టుపక్కల ఉండేవారితో ఘర్షణకు అవకాశం లేదని గుర్తుంచుకోండి. కొన్ని శుభకరమైన పనులు గురించి చర్చించుకుంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ అదృష్టాన్ని విశ్వసించండి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. పరిస్థితి మెరుగుపడుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు  వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. రియల్ ఎస్టేటు విషయంలో కుటుంబ చుట్టుపక్కల వారి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రవర్తనకు సంబంధించిన అన్ని వివాదాలను నేడు పరిష్కరించుకుంటారు. నూతన ప్రాజెక్టుల్లో పనులను ప్రారంభిస్తారు. పనిలో మార్పు వచ్చే అవకాశముంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మానసిక ప్రశాంతతను పొందుతారు. వ్యాపారంలో నూతన ఆవిష్కరణలను తీసుకురాగలుగితే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. పనిలో నూతన మార్పు ఉంటుంది. సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు నూతన అవకాశం సిద్ధిస్తుంది. కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. కోపాన్ని నియంత్రించడం ముఖ్యం. చిక్కుకున్న సొమ్ము పొందే అవకాశముంది. అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారం విషయంలో కొంచెం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. రోజూవారీ పనుల గురించి మించి కొన్ని నూతన పనిని ప్రయత్నించండి. ఒకరు తన పని కోసం కొంత డబ్బు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారికి ప్రయోజనం ఉంటుంది. రోజువారీ ఇంటి పనులను నిర్వహించడానికి మంచి అవకాశంగా ఉంటుంది. సాధారణంగా ఉంటుంది. సంతానం గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నిజాయితీగా ఉండాలి. అనేక రకాల పనులు ఒకేసారి రావడం ఆందోళన పెంచుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ఆహారం, పానీయాల్లో అజాగ్రత్తగా ఉండకండి వ్యాపార పరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. తొందరలో పొరపాటు ఉండవచ్చు. కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాతావరణ మార్పులు వల్ల శరీర రుగ్మతలు తలెత్తుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా విజయాలను అందుకోవచ్చు. ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకుంటే మంచి ఫలతాలుంటాయి. సహనం, మృదువైన ప్రవర్తన ద్వారా సమస్యలను సరిదిద్దుకోవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios