Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: గురువారం 5 నవంబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...   

today 5th november raasi phalas akp
Author
Hyderabad, First Published Nov 5, 2020, 7:10 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ప్రత్యర్థుల నుండి ధన సహాయం స్థిరాస్తి వివాదాలు తొలగి లాభం కలుగును వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది ఉద్యోగ పరమైన విషయాలులో అధికారులనుండి ప్రశంసలు పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు బంధు మిత్రులతో అనుకోని సమస్యలు కలుగుతాయి ధన సమస్యలు పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఆరోగ్య విషయాలలో వైద్యుని సంప్రదింపులు తప్పవు వ్యాపారం చిన్నపాటి లాభాలుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని సమస్యలు ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు నూతన ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి దైవ సంబందమైన కార్యక్రమములలో పాల్గొంటారు వాహన యోగం కలుగుతుంది వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ధన పరమైన వ్యవహారాలు చాలా గందరగోళంగా ఉంటాయి బంధు మిత్రులతో ఉన్న సమస్యలు చర్చలు ద్వారా సరిచేసుకుంటారు పనులలో శ్రమ ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు పట్టుదలతో చేస్తారు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు వ్యవహారాలు ఊహించని విధంగా పూర్తి చేస్తారు ప్రయత్నాలు కార్యసిద్ధి కలుగుతుంది గృహమున శుభకార్యాలు జరుగును ఆర్థిక వ్యవహారాలు అనుకూలవంతంగా సాగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో గుర్తింపు లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆస్తి వివాదాలు సర్దుమణుగుతాయి సమాజమున గౌరవ మర్యాదలు పెరుగుతాయి పనుల్లో ఊహించని విజయం లభిస్తుంది ఆకస్మిక ధన లాభం కలుగును వ్యవహారములలో విజయం కలుగును ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కొన్ని పనులందు వ్యయ ప్రయాసలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో అనుకోని కలహాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారములు అవరోధములు కలుగుతాయి వ్యాపారాలు కొన్ని ఆటంకాలు కలుగుతాయి నిరుద్యోగులకు నిరుత్సాహంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు పనులందు ఆటంకాలు పెరుగి మానసిక సమస్యలు పెరుగుతాయి ధన పరమైన చికాకులు కలుగుతాయి అప్పుల ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరుగుతుంది స్నేహితులతో మాట పట్టింపులు వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఉంటాయి ఉద్యోగాలలో స్దాన చలనాలు ఉంటాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు నిరుద్యోగులకు శుభవార్తలు తెలుస్తాయి ముఖ్యమైన పనులలో విజయం కలుగుతుంది దైవ సంభందమైన కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది ధన సంబందం విషయాలలో పరిస్థితి అనుకూలం వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగాలలో పురోగతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు సమాజంలో కొత్త పరిచయాలు పెరుగుతాయి బంధు వర్గం వారినుండి శుభవార్తలు అందుతాయి సన్నిహితుల నుండి విలువైన సలహాలు అందుకుంటారు ప్రయత్నములలో కార్యసిద్ధి కలుగును అధికారుల వలన లాభములు కలుగును వృత్తి వ్యాపారాలు అభివృద్ధి కలుగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు వ్యాపార వ్యవహారాలు అవరోధములు కలుగును ఊహించని కలహములు ఆకస్మిక ప్రయాణాలు వృత్తి పరమైన ఒడిదుడుకులు తప్పవు ఉద్యోగమున ఊహించని మార్పులు కలుగును ఆరోగ్య పరమైన సమస్యలు కలుగును ఆర్థికంగా కొంత అనుకూలత కలుగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు సకాలంలో పనులు పూర్తికావు వాహన ప్రయాణాలలో అనుకోని మార్పులు వృత్తి వ్యాపారములలో కొంత నిదానంగా పూర్తి అవుతాయి ప్రయాణమున జాగ్రత్త అవసరం ఆలోచనలలో స్థిరత్వం లేకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు తప్పవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios