Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 2 డిసెంబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ ఎలా ఉన్నాయో చూసుకోండి...  

Today 2nd december raasi phalas akp
Author
Hyderabad, First Published Dec 2, 2020, 7:17 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు రుణదాతల ఒత్తిడులు. కుటుంబసభ్యులతో తగాదాలు. చేపట్టిన పనులు  నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో నిరుత్సాహమే. ఉద్యోగాలలో  ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ముఖ్య పనులు పూర్తి. సమాజసేవలో పాలుపంచుకుంటారు. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. కొంత సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపార నిర్వహణలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో అనుకోని బదిలీలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సన్నిహితులతో సఖ్యత. వాహనాలు, స్థలాలు కొంటారు. దైవదర్శనాలు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో  ఆటంకాలు. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితులతో కలహాలు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కుటుంబ సమస్యలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి.  అనుకోని ప్రయాణాలు. వ్యాపార లావాదేవీల్లో చిక్కులు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు దూరపు బంధువుల కలయిక. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో విజయం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడుల నుంచి విముక్తి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు నూతన ఉద్యోగాలు. వ్యవహారాలలో పురోగతి. కొత్త వ్యక్తుల పరిచయం.  ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి ఆశాజనకం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మిత్రులతో విభేదాలు.  ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు మధ్యలో విరమించే అవకాశం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఊహించని మార్పులు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు పూర్వపు మిత్రుల నుంచి కీలక సమాచారం. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు. పనులు సకాలంలో పూర్తి.  వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios