వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు మీరు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు పరిష్కరించడానికి గడుపుతారు. మీ భౌతిక, ప్రాపంచీక దృక్పథం చాలా మార్పులను తీసుకొస్తుంది. ఏదైనా నూతన పనిని ప్రారంభించాలనుకుంటే జాగ్రత్తగా ఉండండి. మీ ఆత్మ గౌరవం దెబ్బతినే అవకాశముంది. పోరాటం తర్వాత విజయం మిమ్మల్ని వరిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. మీకు సంపద లాభం ఉంటుంది. నూతన ఆర్డర్ లేదా కాంట్రాక్టులు వచ్చే అవకాశముంది. శత్రువులు మీ చేతిలో ఓడిపోతారు. వ్యాపార రంగంలో నూతన భాగస్వాములు చేరతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు హడావిడిగా ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధతో ఉంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తుంటే భగవంతుడి పేరు మీదుగా ప్రారంభించండి. కచ్చితంగా విజయవంతమవుతుంది. అవివాహితుల వివాహం బలంగా మారుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి.  గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కొంత ఖర్చు అయ్యే అవకాశముంది. వ్యాపారంలో ఎక్కువ కష్టపడినా లాభం మాత్రం తక్కువగానే ఉంటుంది. పనిలో అడ్డంకులు ఉంటాయి. కాబట్టి బాధపడకండి. ఆలోచనాత్మకంగా పనిచేయండి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ పై అధికారి సలహాతో పనిలో ఆలస్యం చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. బిజినెస్ లో సన్నిహితుడికి నిజయమైన విధేయతను కలిగి ఉంటారు. మీ మాటల చతురతతో అందరిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ చేతిలో మీ ప్రత్యర్థులు ఓడిపోతారు. ప్రయాణాల్లో లాభాలు అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు నూతన పనిని ప్రారంభించాలనుకుంటే బాగా ఆలోచించి ఆరంభించాలి. ప్రతి ఒక్కరిని గౌరవించడం నేర్చుకోండి. భవిష్యత్తులో మీకు పనికి వస్తారు. ఉద్యోగం, వ్యాపార రంగంలో మౌనంగా ఉండటం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. వాదనలు ఘర్షణలు నివారించండి. లేకపోతే నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. సౌందర్యం వృద్ధి చెందుతుంది. సన్నిహితుల మద్దతుతో చేసిన పొరపాటును సరిదిద్దవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆదాయం పెరగడం వల్ల లాభాన్ని పొందుతారు. పెట్టుబడుల్లో రిస్క్ చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు మీ పని మెరుగుపడటంలో ప్రత్యేక సహకారం ఉంటుంది. నిపుణుల సలహా తర్వాత మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. భార్యభర్తలు మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబంలో అధిక వ్యయం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి.  గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఇంట్లో సంపద పెరుగుతుంది. సమస్యలను మీకు మీరుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు దానిలో కూడా విజయం సాధిస్తారు. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. వ్యాపారంపై దృష్టిపెడతారు. అస్తవ్యస్తంగా ఉన్న వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. రుణాలివ్వడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. కళ్లు మూసుకొని ఎవ్వరిని నమ్మవద్దు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది. వ్యతిరేక వాదనలు మీకు హాని కలిగించవు. మీకిష్టమైన వారి సహాయంతో విజయాన్ని అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్య, సాహిత్యం దిశలో జరుగుతున్న ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు కోరికలు నెరవేరడంలో సహాయపడతాయి.  శుభకార్యాలు, విధులు కూడా నిర్వహించవచ్చు. ఆధ్యాత్మిక పనుల్లో మీ ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంతో గడపడం మంచిది. వ్యాపారం సాధారణంగా ఉంటుంది. మీరు వినోదం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. నూతన పథకాలను అమలు చేయడానికి అనుకూలమైన సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.