Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: మంగళవారం 27 అక్టోబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ  రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...  

Today 27th october raasi phalas akp
Author
Hyderabad, First Published Oct 27, 2020, 7:18 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Today 27th october raasi phalas akp

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.


మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. పనులన్నీ పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. మీరు సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సాయంత్రం సంతోషంగా ఉంటారు. మీకిష్టమైన వారితో సరదాగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు నూతన ఒప్పందాలు పొందవచ్చు. కాంట్రాక్టుల ద్వారా మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. శుభకరంగా ఉంటుంది.  మానసిక ప్రశాంతత పొందుతారు. రాజకీయ రంగంలో ప్రయత్నాలు చేస్తున్న వారు విజయవంతమవుతారు. పాలన, అధికారం నుంచి ప్రయోజనం పొందుతారు. సంతానం నంచి ఉపశమనం ఉంటుంది. అనవసర బాధలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు విలువైనదాన్ని కోల్పోయే అవకాశముంది. సంతానం విద్యలో లేదా పోటీలో విజయం గురించి వార్తలు వినడం వల్ల సంతోషంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. శుభకరమైన పనుల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నది పూర్తి చేస్తారు.  గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆస్తిని పొందే అవకాశముంది. జీవనోపాధి రంగంలో పురోగతి ఉంటుంది. రాష్ట్ర ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ పిల్లల బాధ్యతను నెరవేర్చుగలుగుతారు. ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రయాణాల నుంచి ప్రయోజనం పొందుతారు. ప్రియమైన వ్యక్తుల నుంచి శుభవార్త అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. మీరు ప్రయోజనం అందుకుంటారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. మాటల మృదుత్వం మీరు గౌరవం పొందుతారు. విద్య, పోటీ రంగంలో విజయాన్ని అందుకుంటారు. కంటి సమస్యలు వచ్చే అవకాశముంది. శత్రువులు తమలో తాము పోరడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉపాధి, వ్యాపార రంగంలో కొనసాగుతున్న ప్రయత్నాల్లో విజయాలు పొందుతారు. సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. చట్టపరమైన వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. ఖర్చుతో పాటు కీర్తి కూడా పెరుగుతుంది. కుటుంబంలో శ్రేయస్సుతో పాటు పరస్ఫర మద్దతు ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఇంటి వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. శుభంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ ఆనందం పెరుగుతుంది. చాలా రోజులుగా కొనసాగుతున్న సమస్య పరిష్కారమవుతుంది. స్నేహితుల రాకతో మీ మనస్సు కుదుటపడుతుంది. చేతిలో తగినంత డబ్బు ఉన్నందున మీకు ఆనందం లభిస్తుంది. ప్రత్యర్థులు ఓడిపోతారు. దూర ప్రయాణాలు చేయడానికి ఓ ప్రణాళిక తయారు చేయవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు.  ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అంతర్గత రుగ్మతలు మిమ్మల్ని బాధపెడతాయి. వ్యాధి స్థితిలో నడక చాలా ఎక్కువగా మారింది. కొన్ని రోజులు నుంచి మీరు విశ్రాంతి తీసుకోండి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. అధికార పార్టీ నుంచి సామీప్యత, పొత్తులు కూడా లభిస్తాయి. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు మిమ్మల్ని సంతోషపరుస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబ, ఆర్థిక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. జీవనోపాధి రంగంలో నూతన ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. సహచర ఉద్యోగుల నుంచి గౌరవం, మద్దతు పొందుతారు. ప్రజలు మీ అభిప్రాయాన్ని అనుసరిస్తారు. ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకండి. తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీకు శారీరక నొప్పి కలుగుతుంది. అనియంత్రిత శత్రుత్వం కారణంగా కొద్దిగా కష్టాలను దాటవేస్తారు. మీ తెలివితేటలు చేసిన పనిలో నష్టం, నిరాశ ఉండవచ్చు. వ్యతిరేక వార్తల విన్న తర్వాత ఒకరు ఆకస్మిక యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైనంతవరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కొడుకు, కుమార్తేను తలచుకుని చింతిస్తూ రోజంతా గడుపుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాల పట్ల అప్రమత్తంగా ఉండండి. దాతృత్వ పనులకు ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. కాబట్టి దుబారా ఖర్చులకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios