Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు (25 ఏప్రిల్ ఆదివారం 2021 )

ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. 

today 25th april sunday raasi phalalu akp
Author
Hyderabad, First Published Apr 25, 2021, 7:12 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today 25th april sunday raasi phalalu akp

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు కార్యజయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు కొత్త రుణయత్నాలు, ఆర్థికంగా ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కార్యక్రమాలలో . అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా.  రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ఉత్సాహంగా  కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంçఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.  కొత్త వ్యాపారాలకు శ్రీకారం. చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు  కార్యక్రమాలలో  ఆటంకాలు. కష్టించినా  ఫలితం కనిపించదు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొద్దిగా చికాకులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీ ఆశయాలు నెరవేరతాయి. పనుల్లో  పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఆదాయం అంతగా అనుకూలించదు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యం. ఉద్యోగులకు ఇబ్బందులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కార్యక్రమాలలో  విజయం. దైవచింతన పెరుగుతుంది. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత చేకూరుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు.  ఆకస్మిక ధనలాభ సూచనలు. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు దూరప్రయాణాలు ఉంటాయి. శారీరక  రుగ్మతలు. బంధువర్గంతో  మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలల్లో తొందరవద్దు. ఉద్యోగాల్లో చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కార్యజయం. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios