Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 24 అక్టోబర్ 2020

 ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ  రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి... 

today 24th october raasi phalas  akp
Author
Hyderabad, First Published Oct 24, 2020, 7:48 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

today 24th october raasi phalas  akp

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు మీరు ఎంచుకున్న రంగంలో అనేక సమస్యలను సులభంగా, వేగంగా విజయవతంగా పనిచేస్తారు. ఇతరులను అధికంగా అంచనా వేయకండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. వ్యాపార విషయాల్లో నిర్ణయాల్లో తీసుకునేటప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. సానుకూల ఆలోచనతో మీరు పనిచేయాలి. కుటుంబ సంబంధాల్లో తాజాదనం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ఆర్థిక విషయాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వ్యాపార పర్యటనలు మీకు లాభదాయకంగా ఉంటుంది. పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. నూతన స్నేహితుడు పట్ల ఆకర్షణ ఉంటుంది. అయితే మీ భావాలను వ్యక్తపరచడానికి సమయం పడుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో వనరులను సమీకరించడం ద్వారా ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి ప్రయత్నించవచ్చు. చుట్టుపక్కల వ్యక్తులపై నిఘా ఉంచండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఏదైనా విషయంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో మీ పనిపై దృష్టి పెట్టండి. లేకపోతే విభేదాలకు దారితీసే అవకాశముంది. మీకు అవసరమైనప్పుడు కుటుంబం, స్నేహితుల నుంచి మద్దతు తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా మీరు నిరాశ చెందవచ్చు. జీవిత అనుభవాలను అర్థం చేసుకోవడం ద్వారా ముందుకు సాగడం మంచిది. విదేశాల్లో విద్యార్థులకు విద్య పొందే అవకాశం లభిస్తుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు మీరు సానుకూల ఫలితాలు అందుకుంటారు. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. కుటుంబ, వ్యాపారంలో లాభం అందుకుంటారు. కుటుంబం పట్ల ఉదార వైఖరిని కలిగి ఉంటారు. మీరు ఎంచుకున్న రంగంలో మీతో పనిచేసే వ్యక్తులను ప్రోత్సహించడంలో విజయవంతమవుతారు. సంతానానికి సంబంధించిన కెరీర్ కు ఆందోళన అంతమవుతుంది. ప్రేమ విషయంలో తీరిక లేకుండా గడుపుతారు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు వ్యాపారంలో విజయాన్ని అందుకుంటారు. మీకు అదృష్టం కలిసి వస్తుంది. గృహస్థుల వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి సభ్యుల అవసరాలను తీరుస్తారు. జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలంగా ఉంటుంది. ఫలితంగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగ రంగంలో నిజాయితీగా పనిచేసినందుకు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సామాజిక, కుటుంబ సంబంధాలు బలంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీరు ఎంచుకున్న రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. విజయం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. విదేశీ సంస్థతో వ్యాపార భాగస్వామ్యం మంచిది. సంబంధాల్లో బహిరంగంగా ఆలోచనలను వ్యక్తీకరించే సమయం ఆసన్నమైంది. పాత జ్ఞాపకాలను తొలగించడం ద్వారా మీ మనస్సును తేలికపరచండి. మీ జీవితంలో నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యాపార ప్రణాళిక పూర్తవుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో నూతన అవకాశాల కోసం సిద్ధంగా ఉండండి. రుణాలు ఇవ్వడం మానుకోండి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారంపై దృష్టి కేంద్రీకరించండి. మీరు నూతన పర్యటనలు చేయాల్సి ఉంటుంది. గతంలో సమస్యలు క్రమంగా ముగుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు మీకు భవిష్యత్తులో ప్రయోజనం అందుకుంటారు. మీరు వ్యాపార విషయాల్లో శక్తిమంతమవుతారు. మీ ప్రాజెక్టుల్లో పూర్తి చేస్తారు. అయితే మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ప్రేమ జీవితం కారణంగా మీ మానసికంగా సంతోషంగా ఉంటారు. నటిస్తున్న వారికి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితులు ప్రభావితమయ్యే అవకాశముంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అశుభ వార్తలు వినే అవకాశముంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఫలితంగా మానసికంగా సంతోషంగా ఉంటారు. పాత స్నేహితుడు మీ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. ప్రేమ జీవితంలో ఎలాంటి వాగ్ధానాలు ఇవ్వకపోతే మంచిది. విద్యార్థులు లక్ష్యాన్ని సాధించడానికి మరికొంత సమయాన్ని కృషి చేయాల్సి ఉంది. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీ వైఖరిలో నూతన మార్పు ఉంటుంది. ఆధ్యాత్మిక పనులపై మీ ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి గౌరవం అందుకుంటారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి గౌరవం మీకు లభిస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నది పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.  పనిలో జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అవకాశం చేజారిపోవచ్చు. కార్యాలయంలో అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. ఉపాధి నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. తండ్రి సహకారంతో కుటుంబ వ్యాపారం విస్తరిస్తుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు వృత్తిగత రంగాల్లో ఉన్నవారితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. స్నేహితులతో సుదూర ప్రయాణాలకు వెళ్లవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. అన్ని సమస్యలను సహనంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. విద్యార్థులకు నూతన అవకాశం లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios