Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 23 అక్టోబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...  

today 23nd october raasi phala akp
Author
Hyderabad, First Published Oct 23, 2020, 7:20 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

today 23nd october raasi phala akp

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు సవాలుగా అనిపించవచ్చు. పని భారం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం వరకు ఉరుకుల పరుగుల మీద పనిచేయాల్సి ఉంటుంది, కానీ అందరి ప్రశంసలు అందుకుంటారు. ఫలితంగా కీర్తి, ధైర్యం పెరుగుతాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. అనవసర ఖర్చులు చేయకండి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ప్రత్యర్థులు మిమ్మల్ని అధిగమించడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో తెలివితేటలతో వ్యవహరించాలి. తొందరపాటుతో ఎలాంటి పనులు చేయకండి. మీకు అలా చేయడం కష్టంగా ఉంటుంది. విజయం నెమ్మదిగా వస్తుంది. నూతన ప్రారంభించడాని ఈ సమయం అనుకూలంగా లేదు. మీ పనిని ముందుగానే పూర్తి చేసి కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సమతూల్యం ఉంటుంది. వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. శుభవార్తల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులు, బంధువులు ఇంటికి రావచ్చు. కొన్ని మంచి చిరస్మరణీయ క్షణాలు వారితో గడపుతారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఫలితంగా మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. అది మీకు ముందుకు వెళ్లడానికి ప్రయోజనం చేకూరుస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. పెరిగిన ప్రజా సంబంధాల వల్ల మీరు ఉల్లాసంగా గడుపుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రజలు మీచే ప్రభావితమవుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు ప్రతి విషయంలోనూ అదృష్టం పొందుతారు. ప్రత్యర్థులు మీ చేతుల్లో ఓడిపోతారు. మీరు విజయం సాధిస్తారు. ప్రాపంచిన ఆనందం కోసం శుభకరమైన వ్యయం చేస్తారు. ఫలితంగా మానసిక ఆనందం పొందుతారు. పరస్ఫర ఒప్పందం ద్వారా ఎంతో కాలంగా ఉన్న చేదు ప్రభావం అంతమవుతుంది. నూతన పరిచయాలు స్నేహంగా మారతాయి. కుటుంబ పనులు కోసం మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. వృద్ధుల సేవలో ఆనందంగా గడుపుతారు. డబ్బు ఖర్చు చేయడం వల్ల మనసులో ఆనందంగా ఉంటుంది. ప్రత్యర్థులకు మీరు తలనొప్పిగా మారతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. స్నేహితుల సహాయంతో మీ పనిలో విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. అతిథులు వచ్చే అవకాశముంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కొంచెం సవాలుగా ఉంటుంది. అయితే ఎక్కువ కష్టపడినప్పటికీ ఫలితం మాత్రం తక్కువగానే ఉంటుంది. ఆదాయం ఖర్చు తక్కువగా ఉంటుంది. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రహస్య శత్రువులు చురుకుగా ఉంటారు. ఫలితంగా కుటుంబ అశాంతికి దారితీస్తుంది. సాయంత్రం సమయంలో కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని మీరు కుదుర్చుకుంటారు. అది మీకు అనుకూలంగా మారుతుంది. వ్యాపారవేత్తలకు సానుకూల ఫలితాలుంటాయి. మీ పనితీరుతో మీపై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కార్యాలయంలో ఉద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు పనిలో మీరు విజయం సాధించవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సంపద, ఆరోగ్యం శత్రువులపై విజయాన్ని పెంచుతాయి. మీకు మంచి సంకల్పం ఉంటుంది. ఫలితంగా కీర్తి పెరుగుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు అన్ని పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఇందుకు ఆనందంగా ఉంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి.  ప్రతిదాంట్లోనూ విజయం సాధిస్తారు. మంచి వ్యక్తులను కలవడం ద్వారా మీరు శుభఫలితాలను అందుకుంటారు. ఇంట్లో గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలు ముగుస్తాయి. ఉన్నతాధికారుల దయ వల్ల ఆస్తి వివాతాలు పరిష్కారమవుతుంది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల నుంచి ప్రయోజనం పొందుతారు. పెట్టిన పెట్టుబడుల నుంచి ధన లాభం అందుకుంటారు. కష్టపడి పనిచేసి మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబం ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యో, వ్యాపర రంగంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. సోదరులతో కొనసాగుతున్న వివాదం ముగుస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు. మీ పేరు ప్రకాశిస్తుంది. వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెడితే ప్రయోజనం ఉంటుంది. జివితభాగాస్వామితో ఆప్యాయత పొందుతారు. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం పెరుగుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios