Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 22 నవంబరు 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ ఎలా ఉన్నాయో చూసుకోండి... 

today 22nd november raasi phalas akp
Author
Hyderabad, First Published Nov 22, 2020, 7:37 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today 22nd november raasi phalas akp

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు మీ విషయాలు మెరుగుపడతాయి. మీ సహచరులు నుంచి సహాయం పొందుతారు. ఆరోగ్యం, మానసిక స్థాయిని పెంచుతుంది. సృజనాత్మక పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. పనిలో కొంత ఆలస్యం చెందితే ఆందోళన చెందాల్సిన పనిలేదు. త్వరలో పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ పురోగతికి సంబంధించి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒత్తిడిని నివారించండి. రహస్య శత్రువులు మీ ఇమేజ్ ను దెబ్బతీస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు మీ దూరదృష్టి వల్ల మీ పని ద్వారా ప్రభావితమవుతుంది. ఇది మీకు ప్రయోజనం చేకూస్తుంది. జీవనోపాధి రంగంలో అనుభవజ్ఞులైన వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. నూతన అవకాశాలు పొందుతారు. విద్యార్థులు కొత్త జ్ఞానం, అనుభవాన్ని పొందుతారు. తోబుట్టువుల నుంచి మద్దతు అందుకుంటారు. ఆర్థిక ప్రయోజనంతో జీవిత భాగస్వామి సంతోషంగా ఉంటారు. అదనంగా మీరు ఏ ప్రత్యర్థి నుంచి ఆఫర్ పొందవచ్చు. మీరు ఎంచుకున్న రంగంలో వైవిధ్యం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు పని వాతావరణం మెరుగుపడుతుంది. దీని వల్ల పనిలో మీ మానసిక స్థితి వృద్ధి చెందుతుంది. ఏదైనా పథకంపై డబ్బు ఖర్చు చేయాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. లేకపోతే డబ్బు ఇప్పుడున్న చోటే భద్రంగా ఉంచుకోండి. పిల్లలు పురోగతి వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. ఎలాంటి ఇన్ఫేక్షన్లనైనా నివారించండి. మీ కుటుంబ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు కెరీర్ కు సంబంధించి ప్రతిపాదనను పరిశీలిస్తుంటే లాభ - నష్టాల గురించి సమాచారం పొందండి. వ్యాపార పర్యటనలు చేసే అవకాశముంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. చిన్న పిల్లలతో కుటుంబానికి మంచి సమయం ఉంటుంది. ప్రేమ జీవితానికి తగిన సమయాన్ని కేటాయిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు పెట్టుబడిలో రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తులో లాభం పొందుతారు. రియల్ ఎస్టేటు ఒప్పందం గురించి ఆలోచిస్తుంటే మీరు ముందుకు సాగవచ్చు. తమ్ముడి సలహా వ్యాపారాన్ని పెంచుతుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడపండి. మీ సంబంధాలు బలపడతాయి. వ్యాపార సామర్థ్యం, ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. పనుల్లో విజయం సాధిస్తారు. అన్ని సవాళ్లను చక్కగా నిర్వహిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు  మీకు సాధారణ జీవితంలో మార్పు. అసంపూర్ణమైన పని చేయడానికి అవకాశముంటుంది. మీ పనిని అధికారులు మెచ్చుకుంటారు. విదేశాల్లో పనిచేసే స్థానికులకు ప్రయోజనం ఉంటుంది. నూతన సమాచారం పొందవచ్చు. తండ్రి మద్దతుతో మార్గదర్శకత్వం పొందుతారు. జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు. సామాజిక ప్రతిష్ట, కుటుంబ సంపద పెరుగుతాయి. ప్రోగ్రాంను మార్చడం సరైంది కాదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం కూడా పెరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. నూతన పనులు చేయడానికి ఈ సమయం సరైంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని మీరనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు మంచి రాబడి వస్తుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. ప్రేమ జీవితంలో గౌరవం పొందడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు అద్భుతమైమనవని రుజువు అవుతుంది. వైవాహిక జీవితంలో తీపి ఉంటుంది. ఎవరైనా చేసినా దయాదాక్షిణ్యాలు మీకు శుభప్రదరమని రుజువు చేస్తాయి. మీరు ఎక్కడైనా ప్రయాణిస్తుంటే మీ సామను రక్షించుకోవాలి. అనవసరమైన ఖర్చును నియంత్రించండి. విదేశాల్లో నివసిస్తున్న బంధువు నుంచి శుభవార్త అందుతుంది. సేవలతో సంబంధం ఉన్న బాధ్యత పెరుగుతుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఇంట్లో శుభకరమైన పనులకు అవసరమైన వస్తువులు సేకరించుకోగలుగుతారు. ఉపాధి కోరుకునే స్థానికులు విజయం సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ జీవిత భాగస్వామితో సంప్రదింపులు జరపండి. అది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. నూతన వ్యాపార స్నేహితులు మద్దతు ఇస్తారు. మీరు ఎంచుకున్న రంగంలో మీరు చేసిన పనికి అధికారుల నుంచి మద్దతు అందుకుంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు వ్యాపారంలో లాభాలు ఉంటాయి. రాజకీయాలు ప్రజలు సామాజిక పనులు చేయడానికి అవకాశం లభిస్తుంది. స్నేహితుడితో పుట్టిన ఉద్రిక్తత రాజీ పడుతుంది. ఇక్కడ మీ కుటుంబంతో ఉన్న సంబంధం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యాపారంలో సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితంలో మీ అంచనాలు నిరాశకు దారితీస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ మాటలతో కుటుంబ సభ్యులు ముగ్ధులవుతారు. జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. కుటుంబ ఆస్తి పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి నూతన ప్రాజెక్టులపై కృషి చేయండి. విజయానికి మరింత కష్టపడండి. ఏదైనా లావాదేవీలను వాయిదా వేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు మధ్యస్తంగా ఉంటుంది. ఏదైనా మానసిక గందరగోళం లేదా భయం కారణంగా మీ ఆరోగ్యం బాగుండదు. నమ్మదగని వ్యక్తి కారణంగా మీ ఖ్యాతి దెబ్బతినవచ్చు. తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటారు అభివృద్ధి అంత త్వరగా జరగదు. మీరే సమతూల్యం చేసుకోవడంలో ఇంకా ఆలస్యం చేయవద్దు. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు పత్రాలను సరిగ్గా తనిఖీ చేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

 

Follow Us:
Download App:
  • android
  • ios