వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఇంట్లో ఆనందం పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో కొత్త మార్పులు జరుగుతాయి. ఈ మార్పు మీకు తర్వాత ప్రయోజనం చేకూరుస్తుంది. ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండండి. నిర్లక్ష్యం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు స్వల్ప సమస్యలు వస్తాయి. అందువల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీకు అడగడుగునా ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాయంత్రం తర్వాత సహనం పెరుగుతుంది. ఇరుగు పొరుగు వారు సహకరిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కష్టపడి పనిచేస్తే మీకు విజయం లభిస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన పెట్టుబడులు పెడతారు. ఈ రంగంలో మీకు ప్రత్యేక గౌరవం లభించే అవకాశముంది. కుటుంబంలో విడిపోయే ప్రమాదముంది. ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల్లో కలత చెందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు చాలా కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈ సమయంలో ఆధ్యాత్మికత నుంచి మౌళిక జ్ఞానం పెరుగుతుంది. మీ శారీరక సుఖాలు పెరుగుతాయి. ఇతరుల లోపాలను వెతకడం ఆపిస్తే మీ కీర్తి దశదిశలా వ్యాప్తి చెందుతుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉంటే మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పనుల్లో మీకు ఆసక్తి పెరుగుతుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అంతేకాకుండా పేదలకు సాయం చేయగలుగుతారు. మీ వాగ్ధాటి, సామర్థ్యంతో ఇతర వ్యక్తులను ఆకర్షించగలుగుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు మీ ప్రభావం పెరుగుతుంది. అవసరమైన ఖర్చులు తెరపైకి వస్తాయి. వారు కోరుకోకపోయినా బలవంతం చేయాల్సి ఉంటుంది. మీ డబ్బు నిలిచిపోతే ఆ రోజు అందుకోలేరని మీరు భావిస్తున్నారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు కష్టపడి పని చేయడం వల్ల ఆరోగ్యం ప్రభావమేమి ఉండదు. సమాజం, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం ఉంటుంది. కుటుంబం నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీరు పనిచేస్తే మీ హక్కులు పెరుగుతాయి. అలాగే మీ బాధ్యత కూడా పెరుగుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించే వ్యవహారాల్లో విజయాన్ని అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. అనవసరమైన ఖర్చులు వస్తాయి. మీకు అనవసరమైన కోపం ఉంటుంది. కాబట్టి ఓపికగా ఉండండి. సాయంత్రం కొన్ని శుభవార్తలు రావడం మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. మీకు శుభకార్యాలకు వేడుకలకు హాజరవుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు కొంత సమయం సామాజిక పనుల్లో గడుపుతారు. శారీరక సుఖాల్లో కొంత తగ్గుదల ఉంటుంది. మీ మనస్తత్వాన్ని త్వరలో ఇతరులకు వెల్లడించకపోతే స్థిరమైన డబ్బును పొందవచ్చు. మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. కాబట్టి ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వల్ల మీరు ప్రయోజనం అందుకుంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం ప్రయత్నాలు భవిష్యత్తులో వృద్ధి చెందుతాయి. విజయం మీ అడుగుజాడలను ముద్దు పెట్టుకుంటుంది. ఇందుకు మీరు ఓపికగా ఉండాలి. బాగస్వామ్య విషయాల్లో ప్రయోజనం పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు మీ భవిష్యత్తులో కొత్త అవకాశాలను తీసుకొస్తుంది. మీపై అధికారులతో సాయంతో మీరు పురోగతి సాధిస్తారు. వ్యాపారం చేస్తే మీరు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. పెద్దల ఆశీర్వాదంతో పనిలో విజయం చెందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి. పాటలు, సంగీతం సాయంత్రం సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు శత్రవుల ద్వార ఆందోళనలు పడతారు. రోజంతా మీ పని చెదిరిపోతుంది. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. పదోన్నతులు పొందుతారు. అకస్మాత్తుగా ఆందోళన వచ్చే అవకాశముంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అకస్మాత్తుగా అతిథులు రావడం వల్ల మీకు కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.