Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 1 నవంబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...  

today 1st november raasi phalas akp
Author
Hyderabad, First Published Nov 1, 2020, 7:12 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

today 1st november raasi phalas akp

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు పనిలో సహోద్యోగుల సలహాతో ప్రయోజనం అందుకుంటారు. వారి ప్రయత్నాల ద్వారా అవసరమైన పనులన్నింటిని పరిష్కరించుకోగలుగుతారు. రాజకీయ, సామాజిక రంగంలో ప్రత్యర్థులు ఇబ్బందులు కలిగించే అవకాశముంది. తల్లి వైపు నుంచి మద్దతు ఉంటుంది. ప్రేమ జీవితంలో సంబంధాలు బాగుంటాయి. పరిచయస్థుడి నుంచి డబ్బు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అతిథుల రాకతో ఖర్చు పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఆహారం మీ ప్రత్యేక నియంత్రణ కలిగి ఉండండి. కళ, సాహిత్యం రంగంలో ఆసక్తి పెరుగుతుంది. పనిప్రదేశంలో సీనియర్ అధికారుల సహాయంతో వ్యాపారం పెరుగుతుంది. అలాగే కొన్ని శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. వ్యాపార పర్యటనలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు మానసిక స్థితి బాగుంటుంది. మీ తెలివితేటలు, నైపుణ్యంతో విజయాన్ని అందుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న గందరగోళం ఈ రోజుతో ముగుస్తుంది. సంతానం నుంచి సంతృప్తికరమైన వార్తలు వింటారు. మీ సోదరులు, సోదరీమణులు సాయంతో అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో పురోగతి ఉంటుంది. కుటుంబ వ్యాపారానికి సహాయపడుతుంది. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. లేకపోతే ఆర్థిక సమతూల్యత క్షీణిస్తుంది. సంతానం వివాహ విషయంలో నూతన సంబంధాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఎలాగైన ప్రమాదాన్ని నివారించండి. తప్పుడు నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కుటుంబ జీవితంలో మీకు కొన్ని హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ధైర్యం, సహనంతో పనిచేయండి. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మీరు ఎంచుకున్న రంగంలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. రుణదాతలకు ఇది సరైన సమయం. ప్రేమ జీవితానికి తగిన సమయం కేటాయిస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు విద్యార్థులు కష్టపడాలి. విదేశాల్లో పనిచేసే వారికి ఇది శుభ సమయం. సోదరి వివాహంలో ఆందోళన ముగుస్తుంది. మీరు ఎంచుకున్న రంగంలో అధికారులు అభినందిస్తారు. తల్లిదండ్రులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ అవసరాలకు తగిన ఖర్చులు ఉండవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ తిరిగి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు మీకు శక్తి పెరుగుతుంది. ఉదయం వేలలో సంపద ప్రయోజనం అందుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో విజయాన్ని అందుకుంటారు. భూములు కొనుగోలు చేసే అవకాశముంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. సంతానం విజయంతో పిల్లల మనస్సు ఆనందంగా ఉంటుంది. నూతన పనులను ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. శత్రువుల మీ చేతిలో ఓడిపోతారు. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. బంధువులు, స్నేహితుల సాయంతో ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ పథకాల నుంచి మద్దతు అందుకుంటారు. వివాహితులకు  సానుకూల ఫలితాలుంటాయి. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. నూతన కార్యాల కోసం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబం, పనిప్రదేశంలో ఇబ్బందులు పెరుగుతాయి. ఇదే సమయంలో మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. రాజకీయాలకు దూరంగా ఉండాలి. సంతానం సంతోషకరమైన వార్తలు వింటారు. ఉపాధి కోరుకునే వారికి విజయం లభిస్తుంది. ఆర్థిక అసమతూల్యత కలిగి ఉండవచ్చు. ఆస్తి కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం కాదు.పెట్టుబడులకు దూరంగా ఉండండి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు తండ్రి ఆశీర్వాదంతో ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుంది. ప్రేమ జీవితం కొత్తగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించండి. సామాజిక పని వల్ల మీ కీర్తి పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. ప్రభుత్వం నుంచి లాభాలు అందుకుంటారు. అనవసర ఖర్చులు చేయకండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక లావాదేవీల్లో ఉదయం నుంచి జాగ్రత్త వహించండి. కుటుంబంలో విధుల కారణంగా ఆరోగ్యాన్ని జాగ్తత్తగా చూసుకోండి. ఆఫీసులో మీ పని సామర్థ్యం చూసి అధికారులు ఆకట్టుకుంటారు. అత్యవసర పనులు కారణంగా రుణం తీసుకునే పరిస్థితి వస్తుంది. జీవిత భాగస్వామితో వివాదం ఉండవచ్చు. స్నేహితుల సాయంతో ప్రత్యేక పని చేస్తారు. ఎందుకంటే ఉత్సాహం పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు మీకు వ్యాపారంలో లాభం ఉంటుంది. గురువుల నుంచి మీరు ఆశీర్వాదాలు పొందుతారు. ఫలితంగా మీరనుకున్న పనులు పూర్తవుతాయి. సమస్యలు ఏమైనా ఉంటే ఈ రోజుతో ముగుస్తాయి. ప్రభుత్వం నుంచి లాభాలు అందుకుంటారు. సోదర, సోదరమణులతో మీ బంధం మరింత బలపడుతుంది. వ్యాపారంలో విజయంలో సాధిస్తారు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికు అనుకున్నది పూర్తి చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios