Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 19 అక్టోబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...  

today 19th october raasi phala  akp
Author
Hyderabad, First Published Oct 19, 2020, 7:06 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మీకు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. వ్యక్తుల దగ్గర కాని లేదా బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలనుకుంటే ఈ రోజు తీసుకోకపోతే మంచిది. ప్రభుత్వం నుంచి గౌరవ మర్యాదలు పొందే అవకాశముంటుంది. పాత స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. భవిష్యత్తులో మీకు పూర్తి ప్రయోజనం అందుకుంటారు. సాయంతం సమయంలో శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. మీ సామర్థ్యం మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పని మార్పిడి చేసుకోవాల్సి వస్తే బహిరంగంగా చేయండి.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ఖర్చులు దూరంగా ఉంటుంది. మీరు ఏదైనా శారీరక వ్యాధితో బాధపడుతుంటే బాధలు పెరుగుతాయి. సామాజిక కార్యకలాపాల్లో అంతరాయం ఉంటుంది. కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంగీతంలో ఆసక్తి ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలుంటాయి. కీర్తి కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇది మీ శత్రువులను కలవరపెడుతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఊహించని విధంగా ఆశీర్వాదాలు అందుకుంటారు. సంతానంపై విశ్వాసం బలంగా ఉంటుంది. తల్లి వైపు నుంచి ప్రత్యేక మద్దతు లభించే అవకాశముంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకి విజయం సాధిస్తారు. మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు ఉంటుంది. చివరిలో ఉపశమనం పొందుతారు. దగ్గరి బంధువుల నుంచి ఆగ్రహ సంకేతాలు కనిపిస్తాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు చాలా ధైర్యంగా ఉంటారు. కష్టమైన పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు. తల్లిదండ్రుల మద్దతుతో ఆనందాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశముంది. మీరు ప్రజల గురించి బాగా ఆలోచిస్తారు. ఫైనాన్స్ వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. మీ నిస్సహాయత లేదా స్వార్థంగా భావిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆస్తి పెరుగుతుంది. ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు. హృదయపూర్వకంగా సేవ చేస్తారు. గురువు పట్ల పూర్తి భక్తి, విధేయతను కలిగి ఉంటారు. మీరు నూతన పెట్టుబడులు పెట్టాల్సి వస్తే అది శుభప్రదంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు స్వల్ప పని ఒత్తిడితో ఆందోళన చెందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలను తీరుస్తారు. వ్యాపార వృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించవు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసి మంచి ఫలితాలు అందుకోవడానికి మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. మీరు సహనంతో, ప్రతిభతో శత్రు పక్షాన్ని జయించడంలో మీరు విజయవంతులవుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు లౌకిక జ్ఞానం పెరుగుతుంది. దాతృత్వం వల్ల అభివృద్ధి చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు అదృష్టం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. ఆహారం విషయంలో సంయమనం పాటించండి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు విలువైన వస్తువులను పొందవచ్చు. అనవసరమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది. అత్త మామల నుంచి అభిమానం, గౌరవం పొందుతారు. వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నూతన పని లేదా వ్యవహారంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తే కచ్చితంగా భవిష్యత్తులో ప్రయోజనం అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు నూతన విషయాలను అన్వేషించడానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. అనవసరమైన వాటిని ఖర్చు చేస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులకు నమ్మకం ద్రోహం చేసే అవకాశముంది. ప్రాపంచీక ఆనందాన్ని పొందుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు అందుకుంటారు. పాత మిత్రులను కలవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దుబారా ఖర్చులను నివారించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు చాలా కాలంగా పరిష్కరించని సమస్యను పరిష్కరించుకుంటారు. సమాజంలో గౌరవంతో పాటు కీర్తి పెరుగుతుంది. మీకిష్టమైనవారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక వైపు మనస్సు మళ్లించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిలో విజయాన్ని సాధిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

   

Follow Us:
Download App:
  • android
  • ios