Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు... ఆదివారం 17 జనవరి 2021

 ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. 

today 17th january raasi phalalu
Author
Hyderabad, First Published Jan 17, 2021, 7:48 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

today 17th january raasi phalalu
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు భూ, గృహయోగాలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు  సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ మరింత  గౌరవం. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు  కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు  కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు. అనుకున్న పనులు మధ్యలో విరమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు నిరుద్యోగుల యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. వాహనాలు కొంటారు. పనులు చకచకా సాగుతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కాంట్రాక్టర్లకు మరింత వృద్ధి.  కొన్ని ఒత్తిడులు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భూలాభం. వ్యవహారాలలో విజయం.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు  కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. పనుల్లో ఆటంకాలు.  కుటుంబ సమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం. పారిశ్రామికవేత్తలకు చిక్కులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు బంధువులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో  ఆటంకాలు చికాకు పరుస్తాయి. కొన్ని అంచనాలు తప్పుతాయి. బాద్యతలు మరింత పెరుగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని  సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఉద్యోగలాభం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు  వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. శ్రమ పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు దూరబంధువుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం.  వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. పరిస్థితులు అనుకూలించవు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios