Asianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: శుక్రవారం 16 అక్టోబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...  

today 16th october raasi phalas akp
Author
Hyderabad, First Published Oct 16, 2020, 7:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందుతారు. మీకు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. తల్లి వైపు నుంచి డబ్బు పొందే అవకాశముంది. సాయంత్రం సమయంలో ఫంక్షన్లలో తీరిక లేకుండా గడుపుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండంట మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు మీకు ఆస్తి లాభం అందుకుంటారు. కుటుంబంలో ఆనందంతో పాటు శాంతి నెలకొంటుంది. వృద్ధుల నుంచి డబ్బు పొందే అవకాశముంది. ఉద్యోగ మార్పుతో పురోగతి ఉంటుంది. కుటుంబ జీవితంలో సరళత ఉంటుంది. అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. సంగీతాన్ని ఆస్వాదిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు ఉద్యోగంలో ఉన్నత స్థానం సాధించే అవకాశముంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. జీవణ ప్రమాణాలు పెరుగుతాయి. నూతన బట్టల పట్ల మీ ధోరణి పెరుగుతుంది. మీ వల్ల శత్రువుల మనోధైర్యాన్ని తగ్గిస్తుంది. కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఇతరులకు సహాయం చేయడం ఓదార్పునిస్తుంది. కాబట్టి అవసరమైనవారికి వీలైనంత వరకు సహాయం చేయండి. సోమరితనం మానుకోని చురుకుగా ఉండండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు పర్యటనలు చేసే అవకాశముంది. బట్టల నుంచి మీరు బహుమతి పొందుతారు. పిల్లల నుంచి ఆనందం పొందుతారు. స్నేహితుల సాయంతో నిరాశావాదం అంతమవుతుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి నిద్ర పోవడం సంతోషంగా ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మీరు ఇంట్లో శుభకార్యక్రమాలు చేయడం వల్ల మనస్సులో ఆనందం కలుగుతుంది.  బిజీగా సమయాన్ని గడుపుతారు. సమగ్ర స్నేహితుల సాయంతో వ్యాపారంలో నూతన వనరులు సృష్టించుకోగలుగుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం వల్ల ధైర్యం పెరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యల వల్ల బాధపడతారు. ఆహారం, పానీయాల విషయంలో నియంత్రణ తీసుకోండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు పని ప్రదేశంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మేధోపరమైన పని చేయడం వల్ల ఆదాయం ఉంటుంది. వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించండి. పిల్లలు ఉన్నత విద్య, పరిశోధనల్లో అర్థవంతమైన ఫలితాలు పొందుతారు.  ఆస్తి నుంచి కొంత ఆదాయం ఉండవచ్చు. సోదరుల సహాయంతో శత్రుత్వం తొలుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీ కోరికకు వ్యతిరేకంగా ఏదైనా పని చేయవచ్చు. అది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో ప్రతి చోటా ఆనందం, శాంతి ఉంటుంది. అకస్మాత్తుగా ప్రణాళికలు లేని ఖర్చులు పెరగవచ్చు. మీరు ఉద్యోగంలో మీపై అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో రాత్రి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు తల్లి నుంచి ఆశీర్వాదాలు పొందుతారు. ఫలితంగా విజయాన్ని సాధిస్తారు. చాలాకాలంగా ఉన్న వ్యక్తి డబ్బు సాయం అందుకుంటారు. పిల్లల నుంచి మేధో రంగం నుంచి అనుకూలమైన ఫలితాలతో కీర్తి పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు శని వల్ల కొన్ని కష్టాలు ఉంటాయి. చర్చల విషయంలో సంయమనంతో ఉండండి. కుటుంబ వివాదంలో తలెత్తవచ్చు. సోదరుల నుంచి సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశముంటుంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణాలు చేసే అవకాశముంటుంది. రాబోయే కొద్ది రోజులు మీ ఆరోగ్యంపై మీరు శ్రద్ధ వహించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మీకు ప్రతిష్ఠ పెంచుతుంది. మీకు సంపద పెరుగుతుంది. శత్రువులను అణచివేస్తారు. బలమైన ప్రత్యర్థులున్నప్పటికీ చివరికి విజయం మీమ్మల్నే వరిస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ఆధ్యాత్మిక పనిలో అదనపు బాధ్యత నిర్వహిస్తారు. మీరు బిజీగా గడుపుతారు. ఎంచుకున్న రంగంలో ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సైద్ధాంతి విభేదాలు తలెత్తకుండా ఉండటానికి కోపం మితిమీరిన వాటికి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా మతపరమైన సందర్శన ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీరు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. ఆధ్యాత్మికతపై విశ్వాసం పెరుగుతుంది. ఆస్తి పెరుగుదల ఉంటుంది. నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులు, బంధువులు ఇంటికి వస్తారు. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. రాజకీయాల్లో ప్రజా సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. మీరు ఆస్తి లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఆత్మవిశ్వాసంతో చేయండి. భవిష్యత్తులో గొప్ప ప్రయోజనం అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios