Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 11 అక్టోబర్ 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ  రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి...  

today 11th october raasi palas akp
Author
Hyderabad, First Published Oct 11, 2020, 7:10 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ
ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు పార్ట్ టైమ్ వ్యాపారం కోసం సమయాన్ని కేటాయిస్తారు. ఆశయాన్ని నెరవేర్చుకుంటారు. కాబట్టి ప్రయత్నాలు ఆపవద్దు. చాలా కాలం సంఘర్షణల తర్వాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమంగా అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుది. పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటే చివరికి అనుకున్నది పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతంగా అందుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల్లో ఏమైనా ఉంటే వాటిలో పాల్గొంటారు. మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మీరు శాశ్వత ఉపయోగం ఉన్న వస్తువులను మాత్రమే కొనాలి. మీకు ప్రత్యేక అతిథి రావచ్చు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు పురోగతిని నిలబెట్టుకోవడమే మీ ప్రధాన విధి. లేకపోతే భవిష్యత్తులో ఖ్యాతి దెబ్బతింటుంది. కాబట్టి మీరు అభినందనలతో సంతోషంగా ఉంటారు. మీ పనిపై దృష్టి పెట్టండి. అనుకూలంగా ఉంటుంది. ఊహించని పురోగతి చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మీ సొంత విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు  మీరు ఎంచుకున్న రంగంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ ప్రయత్నాల ద్వారా సమస్యలన్ని పరిష్కరించుకోగలుగుతారని గుర్తించుకోండి. కుటుంబం పట్ల అంకిత భావంతో ఉంటారు. అందరిపై అభిమానంతో ఉంటారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఉద్యోగ, వ్యాపార రంగంలో పూర్తి పెరుగుదల కోరుకుంటే మీరు సోమరితనం వదలివేయాలి. మీ పనిలో శ్రద్ధ అవసరం. వ్యాపారాన్ని ఆందోళన చెందుతారు. దీనికి కారణం మీ వ్యాపారం గత కొన్ని రోజులుగా నియంత్రణలో ఉండదు. వ్యాపార సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తే అది మీకు మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు ప్రత్యేక ఫలితాలు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ పనిని ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఈ రోజు మీకు ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది. అంతేకాకుండా మీరు ప్రేమ, అప్యాయత పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ఆందోళన చెందుతారు. కొన్ని సమస్యలు వస్తాయి. మరికొన్ని మీ స్వల్ప దృష్టి స్వభావం వల్ల మీరే సృష్టించుకుంటారు. సామాజిక, వ్యాపార రంగంలో ప్రత్యర్థులతో పోటీపడగలరు. మీ ధైర్యం, తెలివితేటలతో మాత్రమే ప్రజలను ఓడించగలరు. మీ మనస్సు బలహీనంగా దురదృష్టంగా ఉంటారు. ఒకరి గురించి చెడుగా ఆలోచించకండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు వ్యాపారంలో విజయం సాధిస్తారు. అవరోధాలు ఉంటే సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మనసులో ఎలాంటి నిస్సహాయ ఆలోచనలు తీసుకురావద్దు. శుభవార్తలను పొందుతారు. వ్యాపార రంగంలో వచ్చే సమస్యలపై ఆధిపత్యం చెలాయించవద్దు. లేకుంటే మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు పనిలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆలోచనాత్మకంగా చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వృత్తి పరంగా పురోగతి ఆత్మవిశ్వాసాన్నిపెంచుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఫలితంగా ప్రయోజనం పొందుతారు. డబ్బు దాచుకుని ఉంటే దాని ఫలితం అందుకుంటారు. మీరు తప్పకుండా ప్రయత్నం చేయాలి. కుటుంబ బాధ్యతల్లో నిర్లక్ష్యానికి పాల్పడకండి. లేకుంటే పరిస్థితుల్లో దూరాలు ఉండవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు  ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలుంటాయి. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. అదృష్టం అభివృద్ధికి సహాయపడుతుంది. అమ్మకాల కొనుగోళ్ల విషయాల్లో లాభం ఉంటుంది. శుభవార్తలు అందుకునే అవకాశముంది. స్నేహితులతో సరదగా సమయాన్ని గడుపుతారు. అనవసరమైన ఇబ్బందులను నివారించండి. వైవాహిక జీవితంలో సుఖంగా ఉంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ఉన్నతాధికారుల సాన్నిహిత్యం నుంచి ప్రయోజనం పొందుతారు. ఎగుమతి-దిగుమతి వ్యాపారంలోనూ లాభాలను కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు శుభకరంగా సాగుతుంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. శుభవార్తలు అందుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో ప్రయోజనం చేకూరుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు జీవితంలో పురోగతి సాధిస్తారు. అనేక అధ్యయనాలు, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగే అవకాశముంది. వివాదాస్పద అంశాలు ముగుస్తాయి. రహస్య శత్రువులు అసూయపడే సహచరుల పట్ల జాగ్రత్త వహించండి. ఎవరికైనా రుణాలు ఇవ్వడం మానుకోండి. తల్లిదండ్రులు, గురువులను సేవించి గౌరవించండి. మీరు ఎంచుకున్న ప్రతి రంగంలో విజయాన్ని అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios