Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: బుధవారం 11 నవంబరు 2020

ప్రముఖ జ్యోతిష పండితులు డాక్టర్ యం.ఎన్. ఆచార్య ఈ రోజు రాశిఫలాలను మీ కోసం అందించారు. మీ జాతకాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూసుకోండి... 

today 11th november raasi phalas akp
Author
Hyderabad, First Published Nov 11, 2020, 7:54 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

today 11th november raasi phalas akp

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు విదేశాలకు వెళ్లాలనుకునేవారికి అవకాశాలు వస్తాయి. ఆదాయ మర్గాలు పెరుగుతాయి. పని ప్రదేశంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తున్నారు. విద్యారంగంలో విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రేమ జీవితంలో కొత్తదనం ఉంటుంది. ప్రమాదకర పెట్టుబడులను నివారించండి. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యంతో పాటు కుటుంబం మొత్తం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ప్రాపంచీక ఆనందం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సమస్యలు ఉన్నప్పటికీ శక్తి పెరుగుతుంది. తండ్రి మార్గదర్శకత్వం నుంచి ప్రయోజనం పొందుతారు. ఆస్తి పెరుగుతుంది. వాహన సౌకర్యం ఉంటుంది. తోబుట్టువుల సహాయంతో లాభల పరిస్థితులు సృష్టించుకోగలుగుతారు. కుటుంబ ఖర్చులు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. ఫలవంతమైన రోజు అవుతుంది. కుటుంబ అసమ్మతి మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. సంతానం నుంచి ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. రోజంతా పనిలో బిజీగా ఉంటారు. వివాహం వైరుధ్యానికి కారణమవుతుంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేయవచ్చు. పెరుగుతున్న ఖర్చులు వల్ల మానసిక ఒత్తిడి ఉంటుంది. సాయంత్రం కొంత ఉపశమనం ఉంటుంది. శుభ ఆలోచనాపరుల నుంచి మద్దతు ఉంటుంది. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడిలో అనుకూలమైన రాబడి ఉంటుంది. కొంత మంది వ్యక్తుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. వారి మార్గదర్శకత్వం ద్వారా నూతన ఆదాయ వనరుల గురించి తెలుసుకుంటారు. సోదరీసోదరుల నుంచి మద్దతు పొందుతారు. మంచి సమయం గడుపుతారు. సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు నూతన వ్యాపారవేత్తలకు భాగస్వామ్యులు ప్రయోజనం చేకూరుస్తారు. ఉపాధి రంగంలో మీరు మంచి పరిస్థితులు సృష్టించుకోగలుగుతారు. మీ వ్యక్తిత్వం నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీపై అధికారులు మీ పనిని అభినందిస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. నూతన ఒప్పందంలోనూ తొందరపడకండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఉత్తమ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఇది మీ నిధలను పెంచుతుంది. మీ బలం పెరుగుతుంది. విద్యార్థులు విశ్వాసం పొందుతారు. పాత అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబంలోని చిన్న సభ్యుడితో మంచి సమయాన్ని గడుపుతారు. పెట్టుబడిలో లాభాలు వస్తాయి. కార్యాలయంలో పనిచేసేటప్పుడు ఏకాగ్రతను కాపాడుకోండి. డబ్బు వృథా కాకుండా చూసుకోండి. వ్యాపారంలో సానుకూల ఫలితాలతో సంతోషిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు పని ప్రదేశంలో మీపై అధికారుల నుంచి మాట వింటారు. అన్ని పనులు సులభంగా జరుగుతాయి. గత కొన్ని రోజులుగా వ్యాపారంలో నష్టాలు సంభవిస్తాయి. విద్యార్థుల విజయం కోసం మరింత కష్టపడాలి. పొదుపులో పెరుగుదల జరుగుతోంది. అలాగే మీకు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితంలో మధురంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండండి. సున్నితమైన సమస్యలపై కుటుంబంతో సంప్రదిస్తారు. ఆస్తి సంబంధిత విషయంలో మీరు కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆహారం, పానీయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. నూతన పనిని ప్రారంభిస్తారు. తక్కువ ధరకు వస్తున్నాయని చెడు వస్తువులను కొనకండి. ఈ రోజు మీరు పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ప్రతికూల పరిస్థితుల్లో కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుంది. విదేశీ సంబంధిత పనులను పూర్తి చేయడానికి డబ్బు ఖర్చు చేయవచ్చు. ప్రమాదాకర పెట్టుబడులను మీకు మద్దతు ఇస్తాయి. విద్యార్థుల ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణాలు మానసిక శాంతిని ఇస్తుంది. వ్యాపారులు నూతన ఆదాయ వనరుల నుంచి లబ్ధి పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. జీవనాధార ఆదాయ సాధనాలు సృష్టించుకోగలుగుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాహనం నుంచి దూరంగా ఉండండి. లేకపోతే గాయం భయం ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యంతో జరుగుతున్న పనికి అవరోధం ఉండవచ్చు. జీవిత భాగస్వామితో సంబంధాలు తీవ్రమవుతాయి. ఆర్థిక పరిస్థితి మితంగా ఉంటుంది. ఏ రకమైన పెట్టుబడి అయినా హానికరమని రుజువు చేస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు అభివృద్ధికి ప్రత్యేక అవకాశాలు పొందుతారు. సామాజిక రంగంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపండి. మీరనుకున్న ప్రాజెక్టులో వ్యాపారంలో సానుకూల ఫలితాలను చూస్తుంది. మీరు కుటుంబ సభ్యుడి నుంచి శుభవార్త వినవచ్చు. స్త్రీ సహాయంతో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అత్యంత పేరున్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీ సంబంధిత పనుల్లో పురోగతి ఉంటుంది. కెరీర్లో పురోగతి లభిస్తుంది. విద్యలో విద్యార్థులకు విజయం సాధిస్తారు. మాతృపక్షం నుంచి పూర్తి సహకారం, మార్గదర్శకత్వం అందుతుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబ వ్యాపారంలో లాభం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios