Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: ఆదివారం 25 అక్టోబర్ 2020

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. 

dina phalalu, october 25, 20202, jyothisam
Author
Hyderabad, First Published Oct 25, 2020, 6:56 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.


మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో సహోద్యోగుల సలహా వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబాన్ని పొరపాటున కూడా విస్మరించవద్దు. వీలైనంత వరకు వివదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.  మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. మీ మాటలను నియంత్రించుకోండి. కెరీర్ లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంపద, హోదా ప్రతిష్ట పెరుగుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు అందుకుంటారు. విద్యార్థులకు నూతన జ్ఞానం, అనుభవం పొందుతారు. కుటుంబంతో అవసరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శారీరక, మానసికంగా బాధ పడతారు. జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనం అందుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో పురోగతి సంతోషంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు మీ బలం పెరుగతుంది. ఇదే సమయంలో సంపద కూడా పెరుగుతుంది. మీ విజయానికి శత్రువులు అసూయపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మీపై అధికారుల కారణంగా చిక్కుకున్న పనులు పూర్తవుతాయి. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది. సంతానం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. దుబారా ఖర్చులను నివారించండి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవం, కీర్తి పెరుగుతుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన అవకాశాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై అశ్రద్ధ పనికిరాదు. మూఢ నమ్మకాలను విద్యార్థులను నివారించండి. స్నేహితులతో వినోద అవకాశాలు అందుతాయి. ఆర్థిక విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఫలితంగా మీ ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. వ్యాపారంలో తండ్రి మార్గదర్శకత్వం ప్రయోజనకరంగా ఉంటుంది. తోబుట్టువుల మద్దతు ఉంటుంది. అత్త మామల నుంచి ప్రయోజనం పొందుతారు. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీ మాటలు మీ ప్రతిష్టను పెంచుతాయి. మీ పనితీరుతో అధికారుల నుంచి అభినందిస్తారు. జీవిత భాగస్వామి భావాలను మీరు గౌరవిస్తారు. కడుపు సంబంధిత ఫిర్యాదులు ఉండవచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యాపారంలో సమస్యలు ముగుస్తాయి. జీవిత భాగస్వామి సంబంధం మధురంగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇది మనస్సును సంతోషపరుస్తుంది. నూతన ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. వివాహం సమస్యల నుంచి మీకు స్వేచ్ఛ లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశముంటుంది. ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ఉపాధిలో మీకు గౌరవం, హోదా లభిస్తుంది. పాత అప్పులను తొలగిస్తారు. వ్యాపార వాణిజ్య దిశల్లో చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రత్యర్థులు ఓటమి పాలవుతారు. విద్యార్థులు ఉన్నత విద్యకు సుగమం అవుతారు. కెరీర్ లో పురోగతి కారణమవుతుంది. వివాహితులకు మంచి ఆఫర్లు వస్తాయి. నూతన పనుల్లో తగిన సమయముంటుంది. కుటుంబం అనవసర ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. రహస్య శత్రువులు, అసూయపడే సహచరులతో జాగ్రత్తలు ఉండాలి. స్వల్ప దూరం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసర ఖర్చులను నియంత్రించండి. లేకపోతే ఆర్థిక సమతూల్యత క్షీణిస్తుంది. కుటుంబ సమస్యలను సహనంతో నిగ్రహంతో అంతం చేసుకుంటారు. ప్రేమ జీవితంలో మీకు మానసిక శాంతి లభిస్తుంది. విదేశీ బంధువు నుంచి శుభవార్త వింటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు ఉపాధి రంగంలో మీరు విజయాన్ని అందుకుంటారు. ప్రేమ జీవితంలో బహుమతులు, గౌరవం లభిస్తాయి. ఇతరుల నుంచి సహకారం పొందగలుగుతారు. నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. తోబుట్టువుల నుంచి మంచి సమయాన్ని గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు రాజకీయ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. తండ్రి మార్గదర్శకత్వం ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. ఆర్థిక పరిస్థితి లాభపడుతుంది. మీరు చిన్న వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయ, వ్యయాల మధ్య సమతూల్యతను పాటించండి. పాత స్నేహితుడిని కలిసే అవకాశముంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు మీ జీవిత భాగస్వామి అన్ని కార్యాల్లోనూ మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. తోబుట్టువులతో సంబంధం బలపడుతుంది. వ్యాపారంలో మీ విలువ పెరుగుతుంది. మీ స్వభావం వల్ల ఆధిపత్యం చెలాయించగలుగుతారు. కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థుల్లో విజయం సాధిస్తారు. ఉత్తమ పెట్టుబడులకు ఇది సరైన సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios