Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: సోమవారం 5 అక్టోబర్ 2020

ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. 

dina phalalu, monday, october 5, 2020
Author
Hyderabad, First Published Oct 5, 2020, 7:09 AM IST

వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప ఆలోచనా విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. జన్మరాశిలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇంట్లో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లితో విభేదాలు తలెత్తే అవకాశముంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు శ్రమతో కూడిన సత్ఫలితాలు సాధిస్తారు. బందుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆపదలు పెరుగుతాయి. ద్వాదశచంద్రబలం అనుకూలంగా లేదు. కుటుంబ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆఫీసులో మీ స్నేహితుల నుంచి సహకారం అందుకుంటారు. మీ పనిని ప్రశంసిస్తారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మనసుకు ప్రశాంతత ఉంటుంది. కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. లాభదాయకమైన శుభకాలం ఉంటుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలించవు. నూతన పనిని ప్రారంభించాలనుకుంటే జీవిత భాగస్వామి సలహా ఉపయోగపడుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు అనుకున్న పనులను అనుకున్న విధంగా చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. పాత మిత్రుల నుంచి సహకారం అందుతుంది. మీ స్వభావంతో కీర్తి పెంచుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఒక మంచి వార్త వింటారు. మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. దైవారాధన ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. చిన్నపిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ జీవితంలో మీరు గౌరవం లభిస్తుంది. సానుకూల ఫలితాలను అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఊహించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. అష్టమ చంద్ర స్థితి అనుకూలంగా లేదు. వివాహిత జీవితంలో ఏదైనా దాచిన విషయం చీలికకు కారణమవుతుంది. ఉపాధి రంగంలో అస్థిరత వల్ల మనసు చెదిరిపోతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. ఒక వ్యవహారంలో మెరుగైన ఫలితాలు అందుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల ఫలిస్తాయి. ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పని ఉన్నట్లయితే పూర్తిచేస్తారు.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు శుభఫలితాలు కలుగుతాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి కొన్ని దృఢమైన చర్యలు తీసుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే మేలు జరుగుతుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. అధికారులకు కార్యాలయంలో పూర్తి సహకారం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు చేపట్టే పనుల్లో అలసట పెరుగుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. బంధువులతో కలహ సూచన ఉంది. ప్రయాణాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఏదైనా వివాదం ఉంటే అది ముగుస్తుంది. భవిష్యత్తును బలోపేతం చేయడానికి విద్యార్థులు నూతన చర్యలు తీసుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు శుభకాలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పని చేయడానికి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆగిపోయిన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు శుభకాలం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రేమ జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబానికి అవసరమైన ఖర్చులను వెల్లడించవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios