Asianet News TeluguAsianet News Telugu

Dina Phalalu: ఈ రోజు ఈ రాశివారికి పట్టింది బంగారం

ప్రముఖ జ్యోతిష్కుడు ఈ రోజు రాశిఫలాలు అందించారు. ఓ రాశివారికి ఈ రోజు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీ జాతకం ఎలా ఉందో, మీరు చేయాల్సిందేమిటో చూడండి.

Dina Phalalu: Luck is on the way for this Raasi
Author
Hyderabad, First Published Nov 15, 2021, 7:11 AM IST

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు  ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు సన్నిహితుల నుంచి ధనలాభం. క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. గృహయోగం. ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. దైవచింతన. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తీరతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కుటుంబంలో ఒత్తిడులు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో తగాదాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాలు తీరతాయి. ధనప్రాప్తి. చర్చలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉధ్యోగాలలో ఊహించని మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Follow Us:
Download App:
  • android
  • ios