Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: మే 1 శనివారం 2021

ప్రముఖ జ్యోతిష్కుడు ఈ రోజుకు సంబంధించిన రాశిఫలాలను అందించారు. ఈ రోజు మీ జాతకం ఎలా ఉందో చూసుకోండి.

dina Phalalu, daily horoscope, may 1, 2021
Author
Hyderabad, First Published May 1, 2021, 6:54 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు ఆర్థికాభివృద్ధి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువర్గం నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాలు. వృత్తి,వ్యాపారాలు నిరుత్సాహం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. భూ, గృహయోగాలు. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు బంధువులు, మిత్రులతో వివాదాలు. శ్రమాధిక్యం. శ్రమ పెరుగుతుంది. ఆస్తి వివాదాలు. వృత్తి,వ్యాపారాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు. ఆధ్యాత్మిక చింతన అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పనులలో పురోగతి. కాంట్రాక్టులు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. దైవదర్శనాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు  కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఇంటాబయటా అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు పనుల్లో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహన యోగం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios