డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు అకస్మాత్తుగా పాత స్నేహితుడినే కలిసే అవకాశముంది. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేందుకు ఆసక్తి చూపుతారు. ప్రణాళికలో కొంచెం విరామం ఉంటుంది. అయితే సాయంత్రం నాటి కచ్చితమైన అవకాశాన్ని పొందుతారు. మీరు కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీరు ఎంచుకున్న రంగంలో ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు పని నుంచి ఉపశమనం లభిస్తుంది. తీరిక లేకుండా సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. భాగస్వామ్యంలో ఏదైనా పనిని ప్రారంభించడానికి ముందు ఓ సారి పరిశీలించంది. వృత్తి, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు అనేక పనులను పూర్తి చేయగలుగుతారు. ఏ పనిలోనూ తొందరపాటు పనికిరాదు. చేసే పనులు జాబితాను జాగ్రత్తగా సిద్ధం చేసుకోండి. మొదట ఏ పనులను నిర్వహించాలో వాటికి ప్రాధాన్యమివ్వండి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుంది. వ్యాపారానికి సంబంధించిన సమావేశాలకు వెళ్లే అవకాశముంది. అందువల్ల పనిని పెండింగులో ఉంచవద్దు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు చాలా విషయాలు కలిసి వస్తాయి. ఇంట్లో, కార్యాయం రెండింటిన సమతూల్యం చేసుకోవడం అవసరం. పనిలో ఆందోళనను ఇంట్లో చర్చించడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపారంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదలు, తగాదల విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తే మంచిది.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ రోజు ఏ విషయంలోనూ కలత చెందకుండా ప్రశాంతమైన మనస్సుతో పనిచేయండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మంచి అవకాశాలను పొందవచ్చు. ఉద్యోగ రంగంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. ఈ సమయంలో కుటుంబ బాధ్యతలను విస్మరించడం సరికాదు. సమయం గడిచే కొద్ది కుటుంబంలో ఎన్ని ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా క్షణంలోనే అన్ని పోతాయి. కాబట్టి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పెట్టుబడి సంబంధిత కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు దయచేసి పెద్దల అభిప్రాయాలను తెలుసుకోండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు ఉద్యోగ సమస్యలను అధిగమించగలుగుతారు. ఆందోళన చెందకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ప్రత్యర్థులు మీకు హాని కలిగించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీకిష్టమైనవారి నుంచి ఫిర్యాదు అందుకుంటారు. కొన్ని సమయాల్లో వారికి సమయం ఇవ్వలేదని బాధపడతారు. తెలివితేటలతో ప్రత్యర్థుల వ్యూహాలకు దెబ్బకొడతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు ఇటీవలే మీరు కొత్త ఉద్యోగంలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ పనిలో ఉద్రిక్తత పెరుగుతుంది. నూతన బాధ్యతలను నెరవేర్చడంలో మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. తెలివిగా ఖర్చు చేయాల్సిన అవసరముంది. ఈ సమయంలో మీకు డబ్బు అవసరమైతే ఒకరి నుంచి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. మెట్టునింటి వైపు నుంచి ఉద్రిక్తత ఉండవచ్చు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు ఇంటి నిర్వహణా భారమంతా మీ భుజాలపై పడవచ్చు. ఎలాంటి ఒత్తిడి లేకుండా జాబితాను సిద్ధం చేసుకోండి. అప్పుడే వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అందం గురించి వ్యయం పెరుగుతుంది. సోదరభావం ఒకరికొకరు ఆప్యాయతను పెంచుతుంది. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సంతానానికి సంబంధించి శుభవార్త అందుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు తీరిక లేకుండా గడుపుతారు. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అదనపు పనికి బయలదేరవచ్చు. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. తద్వారా మనం ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండండి. వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆహరం విషయంలో సంయమనంతో ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కార్యాలయ సంబంధిత పనుల్లో మనస్సులో సందిగ్ధత ఉంటుంది. విదేశాల్లో నివసిస్తున్న మీ బందువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో మీకు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఫలితంగా లాభాలు పొందుతారు. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు  సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధన ప్రయోజనం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్ధత ఏర్పడే పరిస్థితి ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా ప్రయాణాల్లో ఖర్చు చేయాల్సి రావచ్చు. ఉద్యోగ నిపుణులను శుభకరంగా ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.