వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషకరంగా సమయాన్ని గడుపుతారు. సౌకర్యవంతమైన వాతావరణాన్ని అనుభవిస్తారు. సోదరుల సహకారంతో పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఫలితంగా సంతృప్తికరంగా ఉంటారు. కెరీర్ లో మంచి పూరోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో కఠినంగా వ్యవహరించడం వల్ల సంబంధాల్లో చీలికలు ఉంటాయి. సాయంత్రం కుటుంబం, స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు. డబ్బు వృధాగా ఖర్చు చేయకూడదు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు  వ్యాపారంలో పురగోతి సాధించాలంటే బద్ధకాన్ని విడనాడాలి. డబ్బు సంబంధిత ప్రతిపాదన వస్తే తప్పుదారి పట్టకండి. మీరు నూతన పనులు, వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దాని కోసం మీరు కొంచెం శ్రమించాల్సి ఉంటుంది. తమ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించండి. వీలైనంత వరకు బయట ఆహారం మానుకోండి. ప్రేమ జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. సాయంత్రం వేళలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు సమీప భవిష్యత్తులో మీరు ప్రయోజనం అందుకుంటారు. వ్యాపార పర్యటనలు ప్రయోజనకరంగా ఉంటాయి. నూతన ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందులో విజయం సాధించాలంటే మీరు కొంచెం వేచి ఉండాలి. ఆరోగ్యం, ఆర్థిక సంబంధిత విషయాల్లో అప్రమత్తత అవసరం. రియల్ ఎస్టేటుల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు నూతన విషయాలను నేర్చుకునేందుకు ఇదే సరైన సమయం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. వివాహ ప్రతిపాదనలో సంతోషంగా ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ప్రభుత్వ పథకాలకు ప్రయోజనాలు లభిస్తాయి. మీ జీవితంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారు. ప్రభత్వం వ్యాపార ప్రణాళికలకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించడం ద్వారా మీ నూతన దిశలో అడుగులు వేస్తారు. గతంలో వెతుకుతున్న అనేక అవకాశాలు మీకు లభిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo) వారికి :-  ఈ రోజు భాగస్వామితో కలిసి అవసరమైన వనరులను ఏకం చేస్తారు. లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పిల్లల పురోగతి సాధించడం వల్ల మీరు ఆనందంగా ఉంటారు. సోదరుడు, సోదరి సహాయంతో వ్యాపారం విజయవంతమవుతుంది. సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు  సృజనాత్మక కార్యక్రమాల వైపు మీరు దృష్టి పెడతారు. ఏదైనా పని చేసే ముందు మంచి-చెడుల గురించి క్షుణ్నంగా ఆలోచించండి. అదృష్టం సహాయపడుతుంది. కార్యాలయంలో మీ సహచరుల సాయంతో మీరుకున్న పనిని పూర్తి చేస్తారు. కుటుంబంలో వివాదాలను అంతం చేయడానికి ఒకరు చేతులు కలుపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు భవిష్యత్తు ప్రణాళికలను కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం వల్ల లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. లాభాల పరిస్థితుల నుంచి ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు శుభంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి సమయం పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు కార్యాలయంలో, కుటుంబంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. అన్ని రకాల పెట్టుబడులు, లావాదేవీలపై శ్రద్ధ వహించండి. మిశ్రమ ఫలితాలుంటాయి. శారీరకంగా, మానసికంగా బాధపడినప్పటికీ ప్రతి పనిలో వంద శాతం కష్టపడతారు.  వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు బంధువులకు కొంచెం దూరంగా ఉండండి. లేకపోతే సిఫార్సులు సమస్యలుగా ఉండవచ్చు. జీవిత భాగస్వామి భావాలను గౌరవించాలి. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి పెరుగుతుంది.స్నేహితుల సాయంతో వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులు అరికట్టండి.సేవకు సంబంధించిన పనులు పెరుగుతాయి. విదేశాల్లో నివసిస్తున్న బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. నూతన పని లేదా వ్యవహారం ప్రారంభించడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతవరణం తగిన విధంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టండి. తద్వారా మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీరు ఎంచుకున్న రంగంలో మార్పు వచ్చే అవకాశముంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వరు. ఫలితంగా ఇబ్బందికరంగా ఉంటారు. అంతరాత్మ మాట వినండి. వీలైనంత వరకు కోపాన్ని నియంత్రించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీ వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేస్తుంది. మీరు ఆశించిన కోరికలు నెరవేరకపోతే కలత చెందవచ్చు. ఆర్థిక పరిస్థితులు ఉద్రిక్తతంగా ఉంటాయి. అందువల్ల ఏదైనా కొనడానికి సమయం సరిపోదు. విదేశాల్లో పనిచేసే వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.