Today Rasi Phalalu: ఈ రాశులారికి ఆర్థిక సమస్యలు తప్పవు..!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 02.03.2025 ఆదివారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు
వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనులు మందకొడిగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరిగిపోతాయి. ఉద్యోగంలో గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు గొడవలకు దారితీస్తాయి.
వృషభ రాశి ఫలాలు
ఆదాయం విషయంలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబంతో కలిసి ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ట్రాన్సఫర్ సూచనలున్నవి. ముఖ్యమైన విషయాలు వాయిదా వేయటం మంచిది.
మిధున రాశి ఫలాలు
నిరుద్యోగుల కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు బాగుంటుంది. ధన లాభం ఉంది. విలువైన వస్తువులు కొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
చేపట్టిన పనులు ఆలస్యంగా జరుగుతాయి. పిల్లల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో కొన్ని నిర్ణయాల వల్ల ఖర్చు పెరుగుతుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రతికూల వాతావరణం ఉంటుంది.
సింహ రాశి ఫలాలు
ఉద్యోగాల్లో సమస్యలు రాజీకొస్తాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది.
కన్య రాశి ఫలాలు
నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబంలో అనిశ్చితి ఏర్పడుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు నిరుత్సాహంగా ఉంటాయి. కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది. స్థిరమైన ఆలోచనలు చేయలేరు.
తుల రాశి ఫలాలు
వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు కలిసి వస్తుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపారం బాగుంటుంది. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. పనులు పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలను అందుకుంటారు. వాహనయోగం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ధనస్సు రాశి ఫలాలు
ఉద్యోగులకు ఊహించని విధంగా ట్రాన్సఫర్ జరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మకర రాశి ఫలాలు
బంధు మిత్రులతో శుభకార్యాల గురించి మాట్లాడుతారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు దక్కవు. ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం.
కుంభ రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాల్లో విజయం దక్కుతుంది.
మీన రాశి ఫలాలు
శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. కొన్ని వివాదాలు రాజీకొస్తాయి. ఆదాయం బాగుంటుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది.

