MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Today Horoscope: ఈ రోజు ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే

Today Horoscope: ఈ రోజు ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది. ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా. మీకు ఈ రోజు ఎలా ఉండబోతోందో చూద్దాం.

7 Min read
Author : Shivaleela Rajamoni
| Updated : Apr 04 2024, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
telugu astrology

telugu astrology

4-4-2024, గురువారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు)

         
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులు తో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

భరణి నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

కృత్తిక నక్షత్రం వారికి సంపత్తార  (సంపత్ తారాధిపతి బుధుడు) విలువైన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన విశేషాలు వింటారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ధన లాభం పొందగలరు

దిన ఫలం:-చేసే పనుల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.వృత్తి  ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
telugu astrology

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వ)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

మృగశిర నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.భార్య తో సఖ్యత గా ఉండాలి. మనస్పర్థలు మరియు కలహాలు రాగలవు.ప్రయాణంలో జాగ్రత్త అవసరం.సమాజంలో సంభాషణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించవలెను. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండాలి.చేయు వ్యవహారంలో  కోపాన్ని అదుపు చేసుకుని వ్యవహరించాలి. ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

312
telugu astrology

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు:-(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) ముఖ్యమైన పనులను పూర్తి కాగలవు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకొంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

పునర్వసు నక్షత్రం వారికి నైధనతార (నైధన తారాధిపతి శని) ప్రయత్న కార్యాలకు ఆటంకములు కలుగ గలవు.ఊహించని విధంగా ఖర్చులు అధికంగా ఉంటాయి.

దిన ఫలం:-మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.మనసునందు అశాంతి.బంధువర్గము ద్వారా అవరోధాలు ఏర్పడవచ్చు.ఉదర సంబంధిత వ్యాధులు తో ఇబ్బంది కలుగుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి.సమాజంలో ప్రతికూలత వాతావరణం.ఇతరుల యొక్క విషయాలకు దూరంగా ఉండటం మంచిది.ఓం మహావీరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

412
telugu astrology

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు.కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

ఆశ్రేష నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో మనస్పర్థలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాల్లో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండాలి.ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆరోగ్యంగా ఉంటారు.సమస్యలు సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేయాలి. వ్యాపారంలో ఆశించిన ఫలితాలు అందుకోలేరు.ప్రతి పని యందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఓం గణాధిపాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

512
telugu astrology

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులు తో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.

దిన ఫలం:-వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి సాధిస్తారు.కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. విందు వినోదాలకు హాజరవుతారు.రావలసిన డబ్బు అందుతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తగును.ఆర్థికంగా బాగుంటుంది.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.సమాజంలో  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అన్ని విధాలుగా బాగుంటుంది.ఓం విష్ణవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

612
telugu astrology

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి  జన్మ తార (జన్మ తారాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్య

చిత్త నక్షత్రం వారికి పరమ మిత్ర  తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.వాహన యంత్రాధులతో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-తలపెట్టిన కార్యక్రమంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి.వివాదాలకు దూరంగా ఉండాలి.ఆరోగ్యంపై మనసు నిలపాలి. ఆత్మీయులతో విభేదాలు తలెత్తవచ్చు.కోపాన్ని అదుపు చేసుకొని వ్యవహారాలు చక్క పెట్టుకోవాలి.పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో అనుకూలమైన మద్దతు లభిస్తుంది.ఓం మిత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

712
telugu astrology

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) ముఖ్యమైన పనులను పూర్తి కాగలవు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకొంటారు. ఆనందంగా గడుపుతారు.ధనలాభం

విశాఖ  నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) ప్రయత్న కార్యాలకు ఆటంకములు కలుగ గలవు. ఊహించని విధంగా అధిక ఖర్చులు అధికంగా ఉంటాయి.

దిన ఫలం:-చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి.నలుగురికి సహాయ సహకారాలు అందిస్తారు.అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు.ఆరోగ్య అన్ని విధాలా బాగుంటుంది. మనసు నందు ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు.ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. సంసార సౌఖ్యం లభిస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.ఓం సరస్వత్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

812
telugu astrology

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

జ్యేష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో మనస్పర్థలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాల్లో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-మనోధైర్యంతో విజయాలు సాధిస్తారు.అధికారుల అండ దండలు లభిస్తాయి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి డబ్బు చేతికి అందుతుంది.క్లిష్టమైన సమస్యలు ను చాకచక్యంగా ఎదుర్కొంటారు. గృహంలో శుభకార్యములు జరుగును.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఓం భాగ్యలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

912
telugu astrology

telugu astrology


ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి కాగలవు. అధికారులు తో మన్ననలు పొందగలరు.వృత్తి వ్యాపారం లాభిస్తాయి

పూ.షా  నక్షత్రం వారికి  విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదలతో చేసిన పనులు పూర్తి కాగలవు.

ఉ.షాఢ నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధన లాభం పొందగలరు.


దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలం.సంతృప్తి గా ఉంటారు. విద్యార్థులకు అనుకూలం. కష్టానికి తగ్గ ఫలితం పొందుతారు.తగాదాలు పరిష్కారం అవుతాయి.మానసిక  ప్రశాంతత లభించును.
ఆదాయం స్థిరంగా ఉంటుంది.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్త వింటారు.ఇంటా బయటా వ్యవహారాలు సంతృప్తి గా ఉంటాయి. ఓం దత్తాత్రేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1012
telugu astrology

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు .

ధనిష్ఠ నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యంత్రాధులతో జాగ్రత్త.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-తోటి వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. ఎక్కువ శ్రమ లేకుండా వ్యాపారాల్లో రాణిస్తారు.సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు. కార్యసాఫల్యత. ఆత్మీయులతో వాగ్దానం విషయంలో జాగ్రత్త అవసరం.రాబడి పెరుగుతుంది. తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.ఉత్సాహంతో పనులు చేస్తారు. వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.ఓం అష్టలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

1112
telugu astrology

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్రుడు) ముఖ్యమైన పనులను పూర్తి కాగలవు. బంధుమిత్రులతో అభిప్రాయాలను పంచుకొంటారు ఆనందంగా గడుపుతారు.ధనలాభం

పూ.భా నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) ప్రయత్న కార్యాలకు ఆటంకములు కలుగ గలవు. ఊహించని విధంగా అధిక ఖర్చులు అధికంగా ఉంటాయి.

దిన ఫలం:-వృత్తి వ్యాపారాలు  ఉత్సాహంగా సాగుతాయి.చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి.నూతన విషయాలపై దృష్టి పెడతారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఓం త్రిపురాంతకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

1212
telugu astrology

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భాద్ర నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు)  రావలసిన బాకీలు వసూలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) అధికారులు తో మనస్పర్థలు. అకారణ కోపానికి దూరంగా ఉండాలి. విషయాల్లో ఆవేశం తగ్గించుకొని వ్యవహరించాలి.

దిన ఫలం:-ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.ఇతరులతో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులకు గురి కాగలరు.ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది.ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.ఇంటా బయటా  ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.మిత్రుల సహాయంతో పనులు సకాలంలో  పూర్తిచేస్తారు.ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
రాశి ఫలాలు
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Numerology: ఈ 4 తేదీల్లో పుట్టినవారికి 35 ఏళ్ల తర్వాత అసలైన రాజయోగం.. కోటీశ్వరులవుతారు
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ప్రతిభకు తగిన గుర్తింపు.. నిరుద్యోగులకు శుభవార్తలు!
Recommended image3
Mahalakshmi Rajayogam: మహాలక్ష్మీ రాజయోగంతో నవంబర్ నెలలో 3 రాశుల వారి జీవితమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved