Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు మీ రాశి ఫలాలు: శనివారం 7 నవంబరు 2020

ప్రముఖ జ్యోతిష్కుడు డాక్టర్ ఆచార్య ఈ రోజు రాశి ఫలాలను అందించారు. ఈ రోజు జాతక ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.

Daily Horoscope, dina phalalu, astrology, 7 november 2020
Author
Hyderabad, First Published Nov 7, 2020, 6:56 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ రోజు గౌరవ మర్యాదలు పొందుతారు. మీకు చంద్రుడు ప్రయోజనం చేకూరుస్తాడు. ఫలితంగా మీరు శుభకార్యాల్లో చేరడానికి అవకాశం లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ రోజు నూతన ప్రాజెక్టులో ప్రయోజనం లభిస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. చట్టపరమైన వివాదాల్లో విజయం సాధిస్తారు. చివరిలో సమస్యలు ఉన్నప్పటికీ శక్తి పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం పెరుగుతుంది. స్వీయసంతృప్తినిస్తుంది. కార్యాలయంలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ రోజు సృజనాత్మకంగా ఉంటుంది. మీరు ప్రయోజనం పొందుతారు. మీకు ఎక్కువగా ఇష్టపడే పనిలో రోజును గడుపుతారు. మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నూతన ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. స్నేహితుల నుంచి సహాయం అందుకుంటారు. దుబారా ఖర్చును వీలైనంత వరకు నివారించండి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ రోజు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదృష్టం మీ వెంట ఉంటుంది. కుటుంబం మీకు సహాయం చేయడానికి నిలుస్తుంది. మీకు అంకితభావంతో ఏ పని చేసిని అదే సమయంలో విజయాన్ని పొందవచ్చు. కార్యాలయంలో మీ ఆలోచనల ప్రకారం వాతావరణం సృష్టించుకోగలుగుతారు. మీ భాగస్వామి కూడా ఇందుకు సహకరిస్తారు. రాత్రి సమయంలో వివాహానికి హాజరుకావచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ రోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. అధ్యయనాల్లో విషయాల్లోనూ ప్రయోజనం అందుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో పై అధికారి నుంచి గొడవ ఉండవచ్చు. రాత్రి సమయంలో శుభకరమైన పనుల్లో గడుపుతారు. జీవిత భాగస్వామితో మీ సంబంధం మరితం బలంగా ఉంటుంది. అదే విధంగా వారు మీ మాటను వింటారు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీరు ప్రజలను కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. చుట్టుపక్కల వ్యక్తులతో మీ సంఘర్షణను ఎదుర్కోకుండా చూసుకోండి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరముంది. ఏదైనా పవిత్రమైన పని గురించి చర్చ ఉండవచ్చు. మీరు అదృష్టాన్ని విశ్వసించండి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. రాత్రి సమయంలో పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రయోజనం అందుకుంటారు. మీ ప్రవర్తనకు సంబంధించిన అన్ని వివాదాలను మీరు పరిష్కరించుకుంటారు. నూతన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేటు విషయంలో కొంత మంది కుటుంబ సభ్యులు లేదా మీ చుట్టూ ఉన్న కొంత మంది పెద్ద సమస్యలను కలిగిస్తారు. మీరు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ రోజు సానుకూలంగా, బలంగా ఉంటుంది. రోజువారీ పనుల్లో లాభాన్ని అందుకుంటారు. కార్యశీలులుగా ఉండండి. ఇదే సమయంలో ప్రయత్నిస్తూ ఉండండి. కుటుంబంలో శాంతి, స్థిరత్వాన్ని ఆస్వాదించండి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నూతన ఆవిష్కరణను తీసుకురాగలిగితే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. పనిలో కొత్త జీవితం ఉంటుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 
ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ రోజు సాధారణంగా మరింత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం విషయంలో మీరు కొంచెం రిస్క్ తీసుకుంటే పెద్ద లాభం వస్తుందనే ఆశ ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టడానికి ముందు అన్ని అంశాళను ఓ సారి తనిఖి చేసుకోవడం అవసరం. నూతన అవకాశం మీ చుట్టు ఉంటుంది. దాన్ని గుర్తించడం మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. భాగస్వామ్యంతో చేసిన పని నుంచి ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. రోజువారీ ఇంటి పనులను నిర్వహించడానికి మంచి అవకాశం ఉంది. చాలా సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది. నిజాయితీగా ఉండండి. ఆందోళనలు పెరగడానికి అనేక రకాల పనులు చేసుకోవచ్చు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ రోజు కొన్ని విషయాల్లో మీకు ఆసక్తి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాతావరణ మార్పులు నుంచి కొన్ని రుగ్మతలు తలెత్తుతాయి. ఆహారం, పానీయాల విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపార పరంగా ఆహ్లదకరంగా ఉంటుంది. ఆత్రుతలో పొరపాటు చేయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ రుణాలు ఇవ్వద్దు. తిరిగి పొందలేరు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏ విషయంలోనైనా స్నేహితులకు సాయం చేయవచ్చు. మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఆశీర్వాదం లభిస్తుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. సహనం, తేలికపాటి ప్రవర్తనతో సమస్యలను సరిదిద్దుకోవచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios