Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి! ఆ అవకాశం వస్తే అందరికీ దాన్ని నేర్పిస్తానంటూ...

ICC World cup 2023 టోర్నీలో అట్టర్ ఫ్లాప్ అయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్... ‘ఇంగ్లాండ్ జట్టుకి భారత కోచ్ అవసరం ఉంది’ అంటూ స్టేడియంలో ఫ్లకార్డ్... 

Ravi Shastri interested to work as England team Head coach, Eoin Morgan, ICC World cup 2023 CRA
Author
First Published Nov 9, 2023, 3:47 PM IST | Last Updated Nov 9, 2023, 3:47 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది ఇంగ్లాండ్. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ప్రపంచ కప్‌ని ప్రారంభించిన ఇంగ్లాండ్, వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది..

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి, ఎలాగోలా టాప్ 7లోకి ఎంట్రీ ఇచ్చింది ఇంగ్లాండ్. బెన్ స్టోక్స్ సెంచరీ, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ హాఫ్ సెంచరీలతో ఆదుకోవడంతో 339 పరుగుల భారీ స్కోరు చేసింది ఇంగ్లాండ్. ఈ లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ 179 పరుగులకి ఆలౌట్ కావడంతో 160 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది ఇంగ్లాండ్..

ఈ మ్యాచ్ సమయంలో స్టేడియానికి వచ్చిన ఓ క్రికెట్ అభిమాని, ‘ఇంగ్లాండ్ జట్టుకి భారత కోచ్ అవసరం ఉంది’ అంటూ ఫ్లకార్డ్ ప్రదర్శించాడు. దీనిపై కామెంటరీ బాక్సులో ఉన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందించాడు..

‘ఇంగ్లాండ్‌ జట్టుకి భారత కోచ్ అవసరం ఉంది? ఏమంటారు రవి’ అంటూ పక్కనే ఉన్న రవిశాస్త్రిని అడిగాడు ఇయాన్ మోర్గాన్. దానికి హిందీలో ‘హా... హమ్‌కో బులావో, హమ్ సబ్‌కో హిందీ సికాయేగా (నన్ను పిలవండి, నేను అందరికీ హిందీ నేర్పిస్తా... ) కొద్దిగా క్రికెట్ కూడా’ అంటూ సమాధానం చెప్పాడు రవిశాస్త్రి..

2017 నుంచి 2021 టీ20 వరల్డ్ కప్ వరకూ భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు రవిశాస్త్రి. రవిశాస్త్రి కోచింగ్‌లో భారత జట్టు విదేశాల్లో అద్భుత విజయాలు అందుకుంది. టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్‌గా టీమ్‌గా నిలిచింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన భారత జట్టు, 2021 ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. అయితే 2021 టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం వరుస పరాజయాలతో గ్రూప్ స్టేజీ నుంచి నిష్కమించింది.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios