క్రైస్ట్‌చర్చ్‌లోని ఒక మసీదులో దుండగుడు కాల్పులు జరపడంతో బంగ్లాదేశ్-న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేశారు. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం బంగ్లా క్రికెటర్లు క్రైస్ట్‌చర్చ్‌లోని అల్ నూర్ మసీదుకు వెళ్ళారు.

ఆ సమయంలో మసీదులోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ప్రమాదం నుంచి బంగ్లా ఆటగాళ్లు తృుటిలో తప్పించుకున్నారు. అయితే ఇదే ఘటనలో ఆరుగురు పౌరులు అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

తాము ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్లు బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు. దీనిపై బంగ్లా జట్టు మేనేజ్‌మెంట్ కూడా స్పందించింది. ‘‘ తమ జట్టు ఆటగాళ్లు స్థానిక మసీదులో ప్రార్థనలకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. అయితే వెంటనే తేరుకుని అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారని బంగ్లాదేశ్ జట్టు అధికార ప్రతినిధి జలాల్ యూనిస్ తెలిపారు.