Asianet News TeluguAsianet News Telugu

టీ20‌ల్లో చరిత్ర సృష్టించడానికి వికెట్ దూరంలో బుమ్రా...

భారత జట్టులో ప్రస్తుతం టాప్ బౌలర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. టెస్టు, వన్డే, టీ20...ఫార్మాట్ ఏదైనా పదునైన బంతులతో చెలరేగడమే అతడికి తెలిసిన బౌలింగ్. ఇలా అత్యుత్తమ ఆటతీరుతో భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయిన బుమ్రా ఇప్పుడు రికార్డులపై కన్నేశాడు. ఇలా ఆస్ట్రేలియాతో జరిగితే మొదటి టీ20లో అదరగొట్టిన బుమ్రా టీ20 క్రికెట్లో రికార్డుల టాప్ లేపడానికి సిద్దమయ్యాడు.  

team india bowler  bumrah near to t20 record
Author
Bangalore, First Published Feb 26, 2019, 6:24 PM IST

భారత జట్టులో ప్రస్తుతం టాప్ బౌలర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు జస్ప్రీత్ సింగ్ బుమ్రా. టెస్టు, వన్డే, టీ20...ఫార్మాట్ ఏదైనా పదునైన బంతులతో చెలరేగడమే అతడికి తెలిసిన బౌలింగ్. ఇలా అత్యుత్తమ ఆటతీరుతో భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయిన బుమ్రా ఇప్పుడు రికార్డులపై కన్నేశాడు. ఇలా ఆస్ట్రేలియాతో జరిగితే మొదటి టీ20లో అదరగొట్టిన బుమ్రా టీ20 క్రికెట్లో రికార్డుల టాప్ లేపడానికి సిద్దమయ్యాడు.

ఆస్ట్రేలియాతో విశాఖలో జరిగిన మొదటి టీ20 లో టీమిండియా పోరాడి ఓడినపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో బుమ్రా మాత్రం తన బౌలింగ్ తో చివరివరకు ఆసిస్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో పొట్టి క్రికెట్లో బుమ్రా ఇప్పటివరకు తీసిన వికెట్ల సంఖ్య 51 చేరింది.

గతేడాది ఇదే ఆసిస్ తో జరిగిన టీ20 మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి బుమ్రా ఆశిశ్ నెహ్రా రికార్డును బద్దలుగొట్టాడు. ఇలా టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్న అతడు తాజాగా టాప్ పై కన్నేశాడు. 

భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో రవి చంద్రన్‌ అశ్విన్‌ మొదటి స్థానంలో వున్నాడు. అశ్విన్ తన టీ20 కెరీర్లో 52 వికెట్లు పడగొట్టగా బుమ్రా అందుకు ఒక్క వికెట్ దూరంలో నిలిచాడు. ఇప్పటివరకు బుమ్రా 41 టీ20 మ్యాచులాడి 51 వికెట్లు పడగొట్టాడు. 

దీంతో బుధవారం టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న రెండో టీ20లో బుమ్రా ఓ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో అతడు కనీసం ఒక్క వికెట్ తీసిన అశ్విన్ రికార్డును సమం చేయనున్నాడు. ఇక అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొడితే టీ20 క్రికెట్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా బుమ్రా టాప్‌లో నిలవనున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios