Asianet News TeluguAsianet News Telugu

మాజీ కెప్టెన్‌పై రెండేళ్ల నిషేదం...ప్రకటించిన ఐసిసి

అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై క్రికెట్ సంబంధిన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీలంక లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యకు గట్టి  ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రెండేళ్ల పాటు ఎలాంటి క్రికెట్ వ్యవహారాల్లో పాల్గొనకుండా అతడిపై ఐసిసి నిషేధం విధించింది. 

Sanath Jayasuriya banned from all cricket for two years
Author
Sri Lanka, First Published Feb 26, 2019, 8:27 PM IST

అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై క్రికెట్ సంబంధిన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీలంక లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సనత్ జయసూర్యకు గట్టి  ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో రెండేళ్ల పాటు ఎలాంటి క్రికెట్ వ్యవహారాల్లో పాల్గొనకుండా అతడిపై ఐసిసి నిషేధం విధించింది. 

గత కొంత కాలంగా అతడిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఐసిసి(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) విచారణకు ఆదేశించింది. అయితే విచారణ అధికారులకు జయసూర్య  సహకరించపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న ఐసిసి రెండేళ్ల నిషేదాన్ని విధించింది. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ వ్యవహారాల్లో పాల్గొనకుండా అతడిపై ఈ నిషేధం వర్తిస్తుందని ఐసిసి ప్రకటించింది. 

రిటైర్మెంట్ తర్వాత జయసూర్య శ్రీలంక క్రికెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడు. ఈ సమయంలోనే అతడు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐసిసి విచారణకు ఆదేశించింది. ఈ విచారణకు సహకరించకపోవడంతో జయసూర్య రెండేళ్ల నిషేదానికి గురయ్యాడు. 

ఐసీసీ నిబంధనలను ఉళ్లంఘిస్తూ జయసూర్య విచారణకు అందుబాటులో లేకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇలా విచారణ అధికారులకు సహకరించకపోవడంతో పాటు డాక్యుమెంట్లను, ఆధారాలను మాయం చేయడానికి ప్రయత్నించినట్లు ఐసిసి గుర్తించింది.  ఇలా అవినీతి నిరోధక కోడ్ ను ఉళ్లంఘించడంతో జయసూర్యపై నిషేధాన్ని విధించినట్లు ఐసిసి పేర్కొంది.  
 
Follow Us:
Download App:
  • android
  • ios