ఐపిఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ 12 జోష్ మొదలయ్యింది. ఆరంభానికి ముందే ఆటగాళ్ల మధ్య మాటలయుద్దం మొదలయ్యింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి యువ క్రికెటర్, డిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్ సవాల్ విసిరాడు. అయితే రిషబ్ సీరియస్ గా కాకుండా డిల్లీ క్యాపిటల్ జట్టు ప్రమోషన్ కోసం చేసిన వీడియోలో సరదాగా సవాల్ విసిరాడు. 

ప్రతి ఐపిఎల్ సీజన్లోను డిల్లీ జట్టు చెత్త ఆటతీరుతో అట్టడుగు స్థానంలో నిలుస్తోంది. ఇలా గడిచిన 11 సీజన్లలో ఒక్కసారి కూడా ఐపిఎల్ టైటిల్ ను అందుకోలేకపోయింది. చాలా సీజన్లలో కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోయింది. దీంతో విసిగిపోయిన యాజమాన్యం ఈసారి ఇంచుమించుగా ఆ జట్టు మొత్తాన్ని మార్యింది. ఆటగాళ్లు,కోచింగ్, సహాయ సిబ్బందితో పాటు చివరకు జట్టు పేరును కూడా డిల్లీ డేర్‌డెవిల్స్ నుండి డిల్లీ క్యాపిటల్ గా మార్చింది. తాజాగా జట్టు ఆటగాళ్లు ధరించే జెర్సీని కూడా మార్చి నయా జోష్ తో సీజన్ 12 ను ఆరంభించడానికి సిద్దమైంది. 

ఈ సందర్భంగా ఆ జట్టు రిషబ్ పంత్ తో కొత్త జెర్సీకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను రూపొందించింది. ఇందులో టీమిండియా ఆటగాడు, చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని తనకు గురువని...అతడిని చూసే తాను వికెట్ కీఫర్, బ్యాట్ మెన్ గా క్రికెట్ కెరీర్ ప్రారంభించానని అంటాడు. ఇలా ఓవైపు ధోనిని ప్రశంసిస్తూనే మరోవైపు డిల్లీ జట్టు తరపున అతడికి సవాల్ విసురుతాడు. ఈసారి తన ఆట ఎంత భయంకరంగా వుంటుందో చూపించడానికి వస్తున్నా..ధోని బాయ్ తయారుగా వుండు. ఎప్పటిలాగా కెప్టెన్ కూల్ ఈసారి కూల్ గా వుండలేరు అంటూ రిషబ్ సవాల్ విసురుతాడు.  

రిషబ్ సరదాగా చేసిన ఈ సవాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్  గా మారింది. దీంతో డిల్లీ, చెన్నై జట్ల అభిమానులు ఈ వీడియోపై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.  

వీడియో