న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో ఓ మసీదులో దుండగుడు కాల్పులు తెగబడ్డాడు. నల్లరంగు దుస్తులు ధరించిన ఓ సాయుధుడు అల్‌ నూర్ మసీదులోకి ప్రవేశించి ప్రార్థనలు జరుపుతున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తృుటిలో తప్పించుకుంది. టెస్ట్ సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ జట్టుతో మూడో టెస్టు ఆడాల్సి ఉంది. అదృష్టవశాత్తూ బంగ్లా జట్టు ఈ దాడి నుంచి తప్పించుకుంది. మరోవైపు తాము సురక్షితంగా తప్పించుకున్నట్లు క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశాడు.